Stalin: చిన్నారికి చేయూతనందించిన సీఎం స్టాలిన్.. రూ.10 లక్షలు మంజూరు
ABN, First Publish Date - 2023-09-23T08:55:36+05:30
టర్కీలో చికిత్స పొందుతున్న పాపను ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి తరలించేందుకు గానూ ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షలు ప్రకటించారు సీఎం స్టాలిన్
చెన్నై: తమిళనాడు(Tamilnadu)లోని కాంచీపురం(Kanchipuram) జిల్లాకు చెందిన 2 ఏళ్ల చిన్నారి తన కుటుంబంతో కలిసి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి చెన్నై(Chennai)కి వెళ్తుండగా విమానంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను టర్కీ(Turkey)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో అక్కడ ఖర్చులు ఎక్కువయిపోయాయి.
దీంతో చిన్నారి పేరెంట్స్ ఆర్థిక సాయం కోసం ఎదురు చూశారు. చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించేందుకు సహకరించాలని చిన్నారి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విన్నవించారు.ఈ విషయం సీఎంకు తెలిసింది. టర్కీలో చికిత్స పొందుతున్న పాపను ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి తరలించేందుకు గానూ ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షలు ప్రకటించారు. తరలింపు ప్రక్రియను ప్రవాస తమిళుల సంక్షేమ బోర్డు(Welfare Board) చూసుకుంటోంది. బాధితురాలు అస్వస్థతకు గురయ్యాక టర్కీలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Updated Date - 2023-09-23T08:55:36+05:30 IST