ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Piracy: పైరసీ భూతానికి అడ్డుకట్ట!

ABN, First Publish Date - 2023-07-28T03:02:23+05:30

భారతదేశం(India) కథకులకు పుట్టినిల్లు అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌(Anurag Singh Thakur) చెప్పారు.

సినిమాటోగ్రఫీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. చిత్ర పరిశ్రమకు పైరసీ క్యాన్సర్‌ లాంటిది

ఈ మహమ్మారితో ఏటా రూ.20 వేల కోట్ల నష్టం

తాజా బిల్లుతో సినీ పరిశ్రమకు మేలు: కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 27: భారతదేశం(India) కథకులకు పుట్టినిల్లు అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌(Anurag Singh Thakur) చెప్పారు. మన దేశం ప్రపంచానికే ‘సమాచార కేంద్రం (కంటెంట్‌ హబ్‌)’గా ఎదగాలని అన్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌ అండ్‌ కామిక్స్‌ (ఏవీజీసీ) రంగానికి నిపుణులైన మానవ వనరులను అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే శిక్షణ సంస్థలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేయడం, లైసెన్స్‌ ప్రక్రియను సరళతరం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు-2023ను గురువారం రాజ్యసభ(Rajya Sabha) ఆమోదించింది. మణిపూర్‌ అల్లర్ల(Manipur riots)పై చర్చకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు(Opposition parties) సభ నుంచి వాకౌట్‌ చేశాయి. అనంతరం ఈ బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తర్వాత మూజువాణీ ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. ఇక ఈ బిల్లును లోక్‌సభ(Lok Sabha)ఆమోదించాల్సి ఉంది.

ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి ఠాకూర్‌ మాట్లాడారు. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక సినిమాలను నిర్మించే దేశంగా నిలిచిందని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌, ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌ చిత్రాలు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డులు గెలుచుకోవడం ద్వారా దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశాయని కొనియాడారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన చిత్ర పరిశ్రమ పైరసీ కారణంగా ఏటా రూ.20 వేల కోట్ల మేర నష్టపోతోందని చెప్పారు. పైరసీని అడ్డుకొని, ఈ నష్టాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా సినిమాటోగ్రఫీ చట్టం-1952లో సవరణలు చేసినట్లు తెలిపారు. పైరసీ అనేది క్యాన్సర్‌ లాంటిదని, దాన్ని కూకటివేళ్లతో పెకలించివేయడమే లక్ష్యమని చెప్పారు. తాజా చట్టంతో చిత్ర పరిశ్రమకు రక్షణ లభిస్తుందన్నారు. కేంద్ర సెన్సార్‌ బోర్డు స్వతం త్ర సంస్థ అని, కొత్త చట్టం వచ్చినంత మాత్రాన సీబీఎ్‌ఫసీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


బిల్లులో ముఖ్యాంశాలివీ..

సినిమాటోగ్రఫీ(సవరణ) బిల్లు-2023లో అనధికారిక రికార్డింగ్‌, వాటి ప్రదర్శనలను నిషేధించేలా కొత్తగా 6ఏఏ, 6ఏబీ సెక్షన్లను చేర్చారు. ‘ఎవరైనా పైరసీ నేరానికి పాల్పడితే సెక్షన్‌ 6ఏఏ, 6ఏబీ కింద కనిష్ఠంగా మూడు నెలలు, గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. దీంతోపాటు రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇది సినిమా నిర్మాణ ఖర్చులో 5ు వరకూ ఉండొచ్చు’ అని బిల్లులో పేర్కొన్నారు.

సినిమాలకు ప్రస్తుతం సెన్సార్‌ బోర్డు ఇస్తున్న సర్టిఫికేషన్‌ కాలపరిమితి 10 ఏళ్లు ఉంది. కొత్త బిల్లుతో ఈ పరిమితిని ఎత్తేస్తున్నారు. ఇకపై ఈ ధ్రువపత్రాలకు శాశ్వత చెల్లుబాటు ఉంటుంది.

సినిమాలకు జారీ చేస్తున్న యూఏ సర్టిఫికెట్‌కు మార్పులను ప్రతిపాదించారు. ప్రస్తుతం యూఏ సర్టిఫికెట్‌ సినిమాలను తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల పిల్లలు చూసేందుకు అవకాశం ఉంది. దీనికి మార్పులు చేస్తూ యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+గా విభజించారు. అలాగే సినిమాను టీవీ లేదా ఇతర మీడియాలో ప్రదర్శించేందుకు ప్రత్యేక సర్టిఫికెట్‌ జారీ చేసి అధికారాన్ని సీబీఎ్‌ఫసీకి కల్పించారు.

తప్పుడు వార్తల వ్యాప్తి.. 635 యూఆర్‌ఎల్స్‌ బ్లాక్‌

దేశవ్యాప్తంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న 635 యూఆర్‌ఎల్స్‌ను బ్లాక్‌ చేసినట్లు కేంద్రమంత్రి ఠాకూర్‌ సభలో వెల్లడించారు. 2021డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 120 యూట్యూబ్‌ న్యూస్‌ చానెళ్లు సహా 635 యూఆర్‌ఎల్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

దేశంలో అనవసరమైన, వాడుకలో లేని 76 చట్టాలను రద్దు చేసేందుకు ప్రతిపాదించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మోదీ సర్కారు ఇప్పటి వరకు 1486 అనవసర చట్టాలను రద్దు చేసింది. తాజా బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే ఆ సంఖ్య 1562కు చేరనుంది.

చిన్న చిన్న తప్పులను నేరాలుగా పరిగణించకుండా చూసేందుకు 42 చట్టాల్లో 183 సవరణలతో ప్రతిపాదించిన జన విశ్వాస్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును మూజువాణీ ఓటుతో ఆమోదించారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ విద్యుత్తు అవసరాల్లో 75.66 శాతం థర్మల్‌ విద్యుత్కేంద్రాల ద్వారా తీర్చుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Updated Date - 2023-07-28T05:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising