Jacqueline Sukesh: జైలు నుంచి హీరోయిన్ జాక్వెలిన్‌కు లేఖ రాసిన సుకేష్ చంద్రశేఖర్.. ఏం చెప్పాడంటే..

ABN, First Publish Date - 2023-04-09T13:10:40+05:30

మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh chandrasekhar) మరో లేఖ రాశాడు.

Jacqueline Sukesh:  జైలు నుంచి హీరోయిన్ జాక్వెలిన్‌కు లేఖ రాసిన సుకేష్ చంద్రశేఖర్.. ఏం చెప్పాడంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ (Sukesh chandrasekhar) మరో లేఖ రాశాడు. ఈసారి తన ప్రియురాలు, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌‌కు (Jacqueline Fernandez) లెటర్ రాశాడు. ఈస్టర్ (easter) సందర్భంగా ఆమెకు విషెస్ తెలియజేశాడు.

‘‘ మై బేబీ, మై బన్నీ ర్యాబిట్’’ అంటూ సంబోధించాడు. జాక్వెలిన్‌కు ఇష్టమైన ఫెస్టివల్‌కు ఆమెతో ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఈస్టర్‌ను అత్యుత్తమంగా మార్చుతానని మాటిచ్చాడు. ‘‘ ఏడాదిలో నీకు ఇష్టమైన పండుగల్లో ఇదొకటి. నీతో గడిపిన ఆ ప్రత్యేకతను మిస్సవుతున్నాను’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు సుకేష్ చంద్రశేఖర్ ఆనంత్ మాలిక్ ఈ లెటర్‌ను విడుదల చేశారు.

కాగా జాక్వెలిన్‌కు గతంలో సుకేష్ చంద్రశేఖర్ గతంలో ఖరీదైన కార్లు, బహుమతులు కొనిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంపై జాక్వెలిన్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని జైలులో ఉన్నాడు. ఇటివలే కేజ్రీవాల్ అవినీతిపై జైలు నుంచి సంచలన లేఖలు విడుదల చేశాడు. హైదరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో రూ. 15 కోట్లు ఇచ్చినట్టు ఆరోపణలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Updated Date - 2023-04-09T13:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising