ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mathura Land Dispute: మథుర భూవివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Dec 15 , 2023 | 03:46 PM

శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన మథుర భూవివాద కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు గురువారం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన మథుర భూవివాద కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు గురువారం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని హిందూ పక్షం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలు కొనసాగుతాయని, స్టే విధించబోమని అత్యున్నత కోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు.

కాగా శ్రీకృష్ణుడి జన్మించిన ప్రదేశంలో మసీదుని నిర్మించారని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి. సర్వే చేపట్టాలంటూ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను పరిశీలించిన స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ గతేడాది డిసెంబర్‌లో ఆదేశాలు ఇవ్వగా ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టులో సవాలు చేసింది. సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం (నిన్న) సర్వే చేపట్టేందుకు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో సుప్రీంకోర్టు తన వైఖరిని స్పష్టం చేసింది.

ఇదిలావుండగా శ్రీకృష్ణ జన్మభూమి కేసులో (Shri Krishna Janmabhoomi case) గురువారం అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మథురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌లో (Shahi Idgah Complexe) సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందూ పక్షం ‘శ్రీ కృష్ణ విరాజ్‌మాన్’ తరపున దాఖలైన పిటిషన్‌ పరిశీలించి కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ముగ్గురు న్యాయవాదులను కమిషనర్లుగా నియమిస్తూ కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. ‘శ్రీ కృష్ణ విరాజ్‌మాన్’ తరుపున దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి మథుర డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి బదిలీ అయిన మొత్తం 18 పిటిషన్లను హైకోర్టు పరిశీలిచింది. మథుర డిస్ట్రిక్ట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు అన్నింటినీ అందించాలని హైకోర్టు కోరింది.

Updated Date - Dec 15 , 2023 | 03:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising