ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Surrogacy: సరోగసీపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. ఆ రంగాన్ని ప్రోత్సాహించకూడదు

ABN, Publish Date - Dec 13 , 2023 | 07:55 PM

సరోగసీపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతదేశంలో ఈ పరిశ్రమని ప్రోత్సాహించకూడదని బుధవారం అభిప్రాయపడింది. సరోగసీ రూల్స్‌లోని రూల్ 7 ప్రకారం.. ఫారం 2ను మార్చడం ద్వారా సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ...

Delhi High Court On Surrogacy: సరోగసీపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతదేశంలో ఈ రంగాన్ని ప్రోత్సాహించకూడదని బుధవారం అభిప్రాయపడింది. సరోగసీ రూల్స్‌లోని రూల్ 7 ప్రకారం.. ఫారం 2ను మార్చడం ద్వారా సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ కేంద్రం మార్చి 14న జారీ చేసిన నోటిఫికేషన్‌ను భారతీయ సంతతకి చెందిన దంపతులు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


సరోగసీ నిబంధనలోని మార్పులు న్యాయస్థానాల దృష్ట్యానే జరిగాయని.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘అసలు కోర్టు ఎందుకు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి? ఈ సరోగసీ పరిశ్రమని భారత్‌లో ప్రోత్సాహించాల్సిన అవసరం లేదు. మీరు కెనడాలో ఉన్నారు కాబట్టి.. ఇక్కడ పరిశ్రమని నడపలేరు. ఇది బిలియన్ డాలర్ల పరిశ్రమ అవుతుంది. ప్రభుత్వాన్ని ఏదైనా చేయమని మేము అడగాల్సిన సందర్భం కాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. అనంతరం తదుపరి విచారణని 2024 జనవరి 15వ తేదీన వాయిదా వేసింది. ఢిల్లీ ప్రభుత్వం తరపున స్టాండింగ్ కౌన్సెల్ సంతోష్ కుమార్ త్రిపాఠి వాదించారు.

హిందూ ఆచారాల ప్రకారం చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు భారతీయ పౌరులని.. వాళ్లు భారత్‌లో శాశ్వత నివాసితులని పిటిషనర్లు పేర్కొన్నారు. వారిలో సంతానం లేని జంటలు ఎన్నో ఉన్నాయని, వాళ్లు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటుంటారని.. అందుకు ఈ సరోగసీ విధానం అవసరం అవుతుందని వారు చెప్పారు. 2022 డిసెంబర్‌లో దంపతులకు డోనర్ ఓసైట్‌తో సరోగసీ కోసం మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ మంజూరు చేయబడిందని.. వారు అధునాతన చికిత్సగా సరోగసీ విధానాన్ని చేయించుకోవచ్చని పేర్కొంది. అయితే.. 2023 మార్చి 14న సరోగసీ నిబంధనలను సవరిస్తూ, దాతల సరోగసీని నిషేధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

Updated Date - Dec 13 , 2023 | 08:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising