Eid-ul-Fitr: భారత్‌లో రంజాన్ పండుగ సందడి
ABN, First Publish Date - 2023-04-21T20:34:30+05:30
భారత్‌లో నెలవంక కనిపించింది.
న్యూఢిల్లీ: భారత్‌లో నెలవంక కనిపించింది. శనివారం ఈద్ ఉల్ ఫితర్ (Eid ul Fitr) పండుగ జరుపుకోవచ్చని సెంట్రల్ రుయత్ ఈ హిలాల్ కమిటీ (The Central Ruet e Hilal Committee) ప్రకటించింది. న్యూఢిల్లీ, లక్నో, శ్రీనగర్, జైపూర్, హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రంజాన్ పండుగ (ramzan eid) సందడి మొదలైంది. మహ్మదీయ సోదరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు. మార్కెట్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ చార్మినార్ (Charminar) వద్ద రద్దీ నెలకొంది. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన వారు నేడు విరమించనున్నారు. వాస్తవానికి ఇవాళే రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనలు కూడా చేశారు. శనివారం బంధుమిత్రులతో కలిసి రంజాన్ పండుగ జరుపుకునేందుకు సిద్ధమౌతున్నారు.
Updated Date - 2023-04-21T20:38:39+05:30 IST