ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PT Usha : పెద్దల సభ అధ్యక్ష స్థానంలో పరుగుల రాణి!

ABN, First Publish Date - 2023-02-10T04:09:30+05:30

రాజ్యసభలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రఖ్యాత అథ్లెట్‌, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష గురువారం సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యసభలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రఖ్యాత అథ్లెట్‌, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష గురువారం సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌లు లేకపోవడంతో అధ్యక్ష స్థానంలో కూర్చొని పెద్దల సభను నడిపించారు. చైర్మన్‌ కుర్చీలో కూర్చుంటున్న స్వల్పకాలిక వీడియో క్లిప్‌ను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రాజ్యసభ చైర్మన్‌ సీటులో కూర్చొని, సభను నడిపించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ‘ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ చెప్పినట్లుగా.. గొప్ప స్థానం ఇంకా గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంది. రాజ్యసభ సెషన్‌ను నిర్వహిస్తున్నప్పుడు నాకు అలాంటి భావనే కలిగింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో ఈ ప్రయాణంలో మరెన్నో మైలురాళ్లను చేరుకుంటాను’ అని ట్వీట్‌ చేశారు. దీంతో ఆమెకు అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. రాజ్యసభ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ లేని సమయంలో వైస్‌ చైర్‌పర్సన్స్‌ కమిటీలోని సభ్యులు ఎవరో ఒకరు సభాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. గత ఏడాది రాజ్యసభకు నామినేట్‌ అయిన పీటీ ఉష.. ఈ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు.

Updated Date - 2023-02-10T04:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising