ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శాండ్‌విచ్‌లలో టమాటాల్లేవ్‌!

ABN, First Publish Date - 2023-07-23T01:16:55+05:30

మెక్‌డొనాల్డ్స్‌ బాటలోనే మరికొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్లు భారతదేశంలోని తమ అవుట్‌లెట్‌లలో శాండ్‌విచ్‌లు, సలాడ్‌లు సహా ఆహార ఉత్పత్తుల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేశాయి. నాణ్యతా సమస్యలను దీనికి కారణంగా పేర్కొన్నాయి. టమాటాలు తాత్కాలికంగా అందుబాటులో లేకపోవడమే కారణమంటూ

న్యూఢిల్లీ, జూలై 22: మెక్‌డొనాల్డ్స్‌ బాటలోనే మరికొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్లు భారతదేశంలోని తమ అవుట్‌లెట్‌లలో శాండ్‌విచ్‌లు, సలాడ్‌లు సహా ఆహార ఉత్పత్తుల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేశాయి. నాణ్యతా సమస్యలను దీనికి కారణంగా పేర్కొన్నాయి. టమాటాలు తాత్కాలికంగా అందుబాటులో లేకపోవడమే కారణమంటూ ఢిల్లీ విమానాశ్రయం వద్దనున్న ఒక ఫాస్ట్‌ఫుడ్‌ అవుట్‌లెట్‌ నోటీసుబోర్డులో పేర్కొంది. ‘మా నాణ్యతా ప్రమాణాలకు తగిన టమాటాలు అవసరమైనన్ని లభించలేదు. ఉత్తమ పదార్థాలతో ఉత్తమ ఆహారాన్ని మీకు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. అయితే, మేం ఎంతగా ప్రయత్నించినప్పటికీ మా ప్రమాణాలకు తగిన టమాటాలు కావాల్సినన్ని సమీకరించలేకపోయాం’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీలో కనీసం రెండు అవుట్‌లెట్‌లు, యూపీ, చెన్నైలలో ఒక్కొక్క అవుట్‌లెట్‌ తమ ఆహార ఉత్పత్తుల్లో టమాటాలను వాడట్లేదు. మెక్‌డొనాల్డ్స్‌ 2 వారాల క్రితమే బర్గర్లలో టమాటాల వినియోగాన్ని నిలిపివేసింది.

Updated Date - 2023-07-23T01:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising