ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Accidents : లక్షలాది మందిని బలిగొంటున్న రైలు ప్రమాదాలు

ABN, First Publish Date - 2023-06-04T13:27:15+05:30

ఒడిశాలో అత్యంత భయానక రైలు ప్రమాదం సంభవించిన నేపథ్యంలో రైలు ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టం, రైల్వే శాఖ అమలు చేస్తున్న భద్రతా చర్యలపై చర్చ మళ్లీ ప్రారంభమైంది.

న్యూఢిల్లీ : ఒడిశాలో అత్యంత భయానక రైలు ప్రమాదం సంభవించిన నేపథ్యంలో రైలు ప్రమాదాలు, ప్రాణ, ఆస్తి నష్టం, రైల్వే శాఖ అమలు చేస్తున్న భద్రతా చర్యలపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) రికార్డుల ప్రకారం గడచిన పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్లో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

రైళ్ల క్రింద పడిపోవడం, పట్టాలపై ఉన్నవారిపై నుంచి రైళ్లు దూసుకెళ్లడం వంటి దుర్ఘటనల్లో మరణించినవారి సంఖ్య కూడా కలుపుకుంటే గడచిన పదేళ్లలో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 70 శాతం మంది 2017-21 మధ్య కాలంలో మరణించారు.

ఎన్‌సీఆర్‌బీ రైలు ప్రమాదాలను ఐదు కేటగిరీలుగా వర్గీకరించింది. పట్టాలు తప్పడం, ఢీకొట్టడం, పేలుళ్లు/అగ్ని ప్రమాదాలు, రైళ్లపై నుంచి పడిపోవడం లేదా పట్టాలపై ఉన్నవారిని రైలు ఢీకొ్ట్టటం, ఇతర కారణాలు అనే ఐదు రకాలుగా విభజించింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం, 2011లో ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య కారణంగా 25,872 మంది మరణించారు. 2012లో ఈ సంఖ్య 27 వేలకు పెరిగింది. 2013లో 27,765 మంది, 2014లో 25 వేల మంది, 2017లో 24 వేల మంది, 2019లో 24,619 మంది ప్రాణాలు కోల్పోయారు.

2020లో కరోనా మహమ్మారి సమయంలో రైలు ప్రమాదాల వల్ల మరణించినవారి సంఖ్య తగ్గింది. 11,968 మంది రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే 2021లో 27 శాతం పెరిగి, 16,431 మంది ఈ కారణంతో మరణించారు.

రైళ్ల నుంచి పడిపోవడం, వ్యక్తులపై నుంచి రైళ్లు దూసుకెళ్లడం కేటగిరీలో ఎక్కువ మంది ఉన్నారు. 2021లో ఈ కారణాలతో మరణించినవారి సంఖ్య 11,036 మంది. ఇతర కారణాలతో మరణించినవారి సంఖ్య 5,287 మంది. ఇతర కారణాలంటే ఏమిటో వివరంగా చెప్పలేదు. రైళ్లు ఢీకొనడం వల్ల 86 మంది, పట్టాలు తప్పడం వల్ల 22 మంది మరణించారు. 2021లో అగ్ని ప్రమాదాలు లేదా పేలుళ్లలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

2017-21 మధ్య కాలంలో 1 లక్ష మంది రైలు ప్రమాదాల వల్ల మరణించారు. వీరిలో 71 వేల మంది రైళ్ల నుంచి పడిపోవడం లేదా వ్యక్తులపై నుంచి రైలు దూసుకెళ్లడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. రైళ్లు పట్టాలు తప్పడం వల్ల 293 మంది, ఢీకొట్టడం వల్ల 446 మంది మరణించారు. 2017-21 మధ్య కాలంలో మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో 17 వేల మంది రైలు ప్రమాదాల వల్ల మరణించారు. ఉత్తర ప్రదేశ్‌లో 13,074 మంది, పశ్చిమ బెంగాల్‌లో 11,967 మంది, ఒడిశాలో 1,845 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి :

Rajastan : బహిరంగ సభలో మైక్‌ను నేలకేసి కొట్టిన సీఎం గెహ్లాట్.. కారణం ఏంటో తెలుసా...

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Updated Date - 2023-06-04T13:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising