Trishul in Gnanavapi ; జ్ఞానవాపిలో త్రిశూలం
ABN, First Publish Date - 2023-08-06T01:54:48+05:30
జ్ఞానవాపి మసీదులో శుక్రవారం పునఃప్రారంభమైన సాంకేతిక సర్వే రెండో రోజు, శనివారం కూడా కొనసాగింది. ఏఎ్‌సఐ(ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) బృందాల సర్వే సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. కొన్ని విగ్రహ శకలాలను
జ్ఞానవాపి ఆవరణలో త్రిశూలం, స్వస్తిక్, గంట సహా పలు బొమ్మలు
గోడలు, స్తంభాలు, గోపురాలపై లభ్యం
వ్యర్థాల్లో విగ్రహ శకలాల గుర్తింపు
ఫొటో, వీడియోలు సేకరించిన ఏఎస్‌ఐ
‘ఇంతెజామియా కమిటీ’ సహకారం
మసీదులో కొనసాగుతున్న ఏఎస్‌ఐ సర్వే
వారాణసీ, ఆగస్టు 5 : జ్ఞానవాపి మసీదులో శుక్రవారం పునఃప్రారంభమైన సాంకేతిక సర్వే రెండో రోజు, శనివారం కూడా కొనసాగింది. ఏఎ్‌సఐ(ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) బృందాల సర్వే సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. కొన్ని విగ్రహ శకలాలను ఆవరణలోని వ్యర్థాల నుంచి సర్వే బృందం సేకరించింది. ఇన్నాళ్లూ సహాయ నిరాకరణ చేసిన అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ శనివారం నాటి సర్వేకి పూర్తిగా సహకరించింది. గతంలో ఇవ్వడానికి నిరాకరించిన పలు తాళాలను కూడా ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు సహకరిస్తున్నామని ప్రకటించింది. ఇక, శుక్రవారం నిర్వహించిన సర్వేలో భాగంగా జ్ఞానవాపి ఆవరణలోని స్తంభాలు, గోడలు, గోపురాలపై ఉన్న గుర్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడలు, స్తంభాలపై చెక్కి ఉన్న స్వస్తిక్ చిహ్నం, గంట, పువ్వు వంటి ఆకారం, త్రిశూ లం బొమ్మలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీశారు. కాగా, జ్ఞానవాపి మసీదులో సర్వేకు ఆమోదం తెలుపుతూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఇంతెజామియా మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. కాగా, జీపీఆర్(గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్) టెక్నాలిజీ అనే సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి మసీదు భూగర్భంలో ఏవైనా నిర్మాణాలు ఉన్నాయా ? అనే విషయాన్ని సర్వే బృందం అధ్యయనం చేస్తుందని ఏస్‌ఐ మాజీ అధికారి ఒకరు చెప్పారు.
బాబ్రీ ఘటన పునరావృతం కావద్దు: అసదుద్దీన్
జ్ఞానవాపి మసీదుపై ఏఎ్‌సఐ సర్వే నివేదిక వెలువడిన తర్వాత.. 1992 డిసెంబరు 6న జరిగిన బాబ్రీ మసీదు కూ ల్చివేత తరహా ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఏఎ్‌సఐ నివేదిక తర్వాత జ్ఞాన వాపి మసీదులో ప్రార్థన ఆగిపోతుందా? మసీదు స్వభావం ఉంటుందా? లేదా? అని అనుమానాలు వ్యక్తం చేశారు.
Updated Date - 2023-08-06T01:54:48+05:30 IST