ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gay Sex : గే సెక్స్ చేస్తే మరణ శిక్ష

ABN, First Publish Date - 2023-03-22T15:20:30+05:30

స్వలింగ లైంగిక (Same Sex) సంబంధాలపై ఉగాండా ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ తూర్పు ఆఫ్రికా దేశంలో ఇప్పటికే హోమోసెక్సువాలిటీ

Uganda
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : స్వలింగ లైంగిక (Same Sex) సంబంధాలపై ఉగాండా ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ తూర్పు ఆఫ్రికా దేశంలో ఇప్పటికే హోమోసెక్సువాలిటీ (Homosexuality) చట్టవిరుద్ధం. తాజాగా ఉగాండా పార్లమెంటు మంగళవారం ఆమోదించిన బిల్లు ప్రకారం గే సెక్స్ చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించవచ్చు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేవలం ఫాక్స్ ఒడోయి-ఒయివెలోవో మాత్రమే మాట్లాడారు.

ఫాక్స్ ఒడోయి-ఒయివెలోవో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ చట్టం ప్రకారం నేరస్థులు జీవిత ఖైదు లేదా మరణ శిక్ష (Death Penalty)ను అనుభవించవలసి ఉంటుందన్నారు. ఈ బిల్లు దేశాధ్యక్షుడు ముసేవేని వద్దకు వెళ్తుందని, ముసేవేని దీనిని తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చునని తెలిపారు.

ముసేవేని పాలన నియంతృత్వంతో కూడుకున్నదనే విమర్శలు ఉన్నాయి. ఉగాండాలో ఈ బిల్లుకు ప్రజా మద్దతు ఎక్కువగానే ఉంది. ఈ దేశంలో హోమోసెక్సువలిటీ పట్ల తీవ్ర అసహనం ఉంది. వలసవాదపాలన కాలంనాటి చట్టాలు హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణిస్తున్నాయి. 1962లో బ్రిటన్ నుంచి ఉగాండా (Uganda)కు స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుంచి ఇష్టపూర్వకంగా సేమ్ సెక్స్ యాక్టివిటీ (Same sex activity)లో పాల్గొన్నవారిని దోషులుగా ప్రకటించిన దాఖలాలు లేవు.

హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణిస్తున్న దేశాలు 69 ఉన్నాయి. వీటిలో దాదాపు సగం దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఇష్టపూర్వకంగా స్వలింగ సంపర్కం చేసినవారికి మరణ శిక్ష విధించే లేదా అటువంటి అవకాశంగల దేశాలు ఇరాన్, నార్తర్న్ నైజీరియా, సౌదీ అరేబియా, సోమాలియా, యెమెన్, ఆఫ్ఘనిస్థాన్, బ్రూనై, మౌరిటానియా, పాకిస్థాన్, కతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

ఇవి కూడా చదవండి :

Delhi Liquor Policy: సౌత్‌గ్రూపు నిర్దేశించినట్లుగా.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ

Britain Vs India : బ్రిటన్‌కు బుద్ధి చెప్పిన మోదీ ప్రభుత్వం

Updated Date - 2023-03-22T15:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising