కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UN:భారత్‌లో 2025 నాటికి భూగర్భ జలాలు తగ్గుతాయి.. ఐరాస నివేదికలో ఆందోళనకర విషయాలు

ABN, First Publish Date - 2023-10-26T12:29:29+05:30

భారత్ లో 2025నాటికి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని ఐక్యరాజ్మసమితి(UNO) నివేదిక వెల్లడించింది. "ఇంటర్‌కనెక్టడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023" పేరుతో.. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం – ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ (UNU-EHS) ప్రచురించిన ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 70 శాతం భూగర్భ జలాలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు.

UN:భారత్‌లో 2025 నాటికి భూగర్భ జలాలు తగ్గుతాయి.. ఐరాస నివేదికలో ఆందోళనకర విషయాలు

ఢిల్లీ: భారత్ లో 2025నాటికి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని ఐక్యరాజ్మసమితి(UNO) నివేదిక వెల్లడించింది. "ఇంటర్‌కనెక్టడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023" పేరుతో.. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం – ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ (UNU-EHS) ప్రచురించిన ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 70 శాతం భూగర్భ జలాలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. అయితే రానున్న రెండేళ్లలో భూగర్భ జలాలు(Underground Water) తగ్గి దేశ వాయువ్య ప్రాంతంలో నీటి వనరుల కొరత ఏర్పడుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఇండో - గంగా నదీ పరీవాహక ప్రాంతాలు భూగర్భ జలాల క్షీణతను అధిగమించాయని.. దేశ వ్యాప్తంగా కరవు సంభవించే ప్రాంతాల్లో అక్కడ ఆచరించిన విధానాలను అమలు చేయాలని సూచించింది.


ఒకప్పుడు చుక్కా నీరు కూడా లభించని సౌదీ అరేబియా(Saudi Arabia) వంటి దేశాలు ఇప్పుడు పుష్కలమైన నీటి వనరులను సృష్టించుకున్నాయని తెలిపింది. పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న 6 పాయింట్లను ఈ నివేదిక హైలెట్ చేసింది. వాటిల్లో భూగర్భజలాల క్షీణత, మంచు పర్వతాలు కరిగిపోవడం, అంతరిక్ష వ్యర్థాలు తదితర అంశాలున్నాయి. పర్యావరణ మార్పులతో(Environmental Change) ఏటా ప్రజలు ప్రభావితం అవుతున్నారని.. పంటలు ఎండిపోయి కరవు కాటకాలు సంభవిస్తున్నాయని తెలిపింది. కరవు వల్ల కలిగే వ్యవసాయ నష్టాలను తగ్గించడంలో జలాశయాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించింది. కానీ కరవు వల్ల జలాశయాలు కూడా ప్రభావితం అయితే అప్పుడు పరిస్థితి మరింత కఠినంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావం పంటలపై పడి.. దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని తెలిపింది. భారత్.. అమెరికా, చైనాలకంటే ఎక్కువగా నీటిని వినియోగిస్తుంది. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాలు మిలియన్ టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. భారత్ నీటి కొరత ఏర్పడకుండా.. భూగర్భజలాలు పెంచేందుకు కృషి చేయాలని రిపోర్ట్ స్పష్టం చేసింది.

Updated Date - 2023-10-26T12:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising