ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaganyaan mission : ‘గగన్‌యాన్’కు మహిళా రోబో : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

ABN, First Publish Date - 2023-08-26T14:28:05+05:30

భారత దేశం గగన్‌యాన్ మిషన్ లో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షానికి పంపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో జరుగుతాయని తెలిపారు.

Jitendra Singh

న్యూఢిల్లీ : భారత దేశం గగన్‌యాన్ మిషన్ (Gaganyaan mission)లో మహిళా రోబో వ్యోమమిత్ర (Vyommitra)ను అంతరిక్షానికి పంపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో జరుగుతాయని తెలిపారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన జీ20 కాంక్లేవ్‌లో శనివారం ఆయన ఈ వివరాలను తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి వల్ల గగన్‌యాన్ కార్యక్రమం ఆలస్యమైందన్నారు. మొదటి ట్రయల్ మిషన్‌ను అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. వ్యోమగాములను పంపించడం ఎంత ముఖ్యమో, వారిని తిరిగి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. రెండో మిషన్‌లో మహిళా రోబో ఉంటుందని చెప్పారు. ఆమె అన్ని మానవ కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. అంతా సవ్యంగా జరిగితే, మరింత ముందుకు వెళ్లవచ్చునని చెప్పారు.


చంద్రుని దక్షిణ ధ్రువంపైన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టడంతో తాము గొప్ప ఊరట పొందామని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) టీమ్‌తో అనుబంధంగా ఉన్నవారంతా చాలా ఉద్విగ్నంగా ఉన్నామన్నారు. చంద్రయాన్-3 భూ కక్ష్య నుంచి విడిపోయి, చంద్రుని కక్ష్యలోకి చేరినపుడు తాను చాలా ఉద్విగ్నభరితుడినయ్యానని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ చాలా సున్నితంగా చంద్రునిపైకి దిగిందన్నారు. చంద్రయాన్-3 విజయవంతమవడంతో ఇస్రో, భారత దేశం అంతరిక్ష పరిశోధన రంగంలో గొప్ప ముందుగు వేశాయన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. 2019 వరకు శ్రీహరి కోట తలుపులు మూసి ఉండేవని, కానీ ఈసారి మీడియా, విద్యార్థినీ, విద్యార్థులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈసారి ఇది ప్రజల సొంతం అయిందన్నారు. అంతరిక్ష పరిశోధనల కోసం నిధులను పెంచినట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయోత్సవాలు.. ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో మోదీ భావోద్వేగం..

Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..

Updated Date - 2023-08-26T14:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising