ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UttarPradesh: అధికారులపై వేటు వేసిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్.. ఎందుకంటే?

ABN, First Publish Date - 2023-12-07T08:45:40+05:30

అధికార దుర్వినియోగానికి పాల్పడిన పలువురు అధికారులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా తన విధుల్లో అలసత్వం వహించినందుకు సర్వీస్ నుండి తొలగించారని అధికారులు తెలిపారు.

లఖ్ నవూ: అధికార దుర్వినియోగానికి పాల్పడిన పలువురు అధికారులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా తన విధుల్లో అలసత్వం వహించినందుకు సర్వీస్ నుండి తొలగించారని అధికారులు తెలిపారు.

బల్లియా కన్సాలిడేషన్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్‌లోని అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్ సర్వీస్‌ను రద్దు చేసింది.

కన్సాలిడేషన్ కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. అమ్రోహా అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ నితిన్ చౌహాన్‌పై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.


ఇటావా జిల్లాలోని బని గ్రామంలో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కన్సాలిడేషన్ అధికారి అవధేష్ కుమార్ గుప్తాతో పాటు సహాయ కన్సాలిడేషన్ అధికారులు సంతోష్ కుమార్ యాదవ్, అఖిలేష్ కుమార్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.

లేఖపాల్ కన్సాలిడేషన్ ఆఫీసర్ ఓం నారాయణ్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కన్సాలిడేషన్ అధికారులందరూ తమ అధికారిక బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించామని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని నవీన్ కుమార్ తెలిపారు. వీరిలో చాలా మంది అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటుననారు. దీంతో వీరిపై వేటు వేస్తన్నట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-12-07T08:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising