Triple Talak: ఐబ్రోస్ చేయించుకుందని భార్యకు విడాకులిచ్చిన భర్త..
ABN, First Publish Date - 2023-11-02T12:39:55+05:30
ఐబ్రోస్ చేయించుకోవడమే ఓ మహిళ చేసిన తప్పైంది. ఆగ్రహించిన ఆమె భర్త వెంటనే విడాకులు ఇచ్చేశాడు. సౌదీ అరేబియా నుంచి వీడియో కాల్ చేసి ‘ట్రిపుల్ తలాక్’ చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కాన్పూర్: ఐబ్రోస్ చేయించుకోవడమే ఓ మహిళ చేసిన తప్పైంది. ఆగ్రహించిన ఆమె భర్త వెంటనే విడాకులు ఇచ్చేశాడు. సౌదీ అరేబియా నుంచి వీడియో కాల్ చేసి ‘ట్రిపుల్ తలాక్’ చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఐబ్రోస్ చేయించుకున్నానని తన భర్త మహ్మద్ సలీమ్ ‘ట్రిపుల్ తలాక్’ చెప్పాడని ఉత్తరప్రదేశ్‌లోని కన్పూర్‌కు చెందిన గుల్సబా వాపోయింది. తన అభీష్టానికి విరుద్ధంగా ఐబ్రోస్ షేప్ చేయించుకోవడాన్ని కారణంగా పేర్కొన్నాడని ఆమె విచారం వ్యక్తం చేసింది. అత్తంటివారు కట్నం కోసం వేధిస్తున్నారని, హింసను భరించలేకపోతున్నానని ఆమె తెలిపింది. ఈ మేరకు ముస్లిం వివాహ చట్టం కింద కేసు పెట్టానని వెల్లడించింది. కాగా 2022 జనవరిలో గుల్సబాను మహ్మద్ సలీం పెళ్లి చేసుకున్నాడు.
కాగా మహ్మద్ సలీం ఉపాధి కోసం సౌదీఅరేబియా వెళ్లాడు. అక్కడే నివసిస్తున్నాడు. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతుండేవాడు. ఈ మధ్య వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో భార్య ఐబ్రోస్ చేయించుకున్న విషయాన్ని అతడు గుర్తించాడు. తన అనుమతి ఎందుకు తీసుకోలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే త్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఇప్పుడు ఏదైనా చేసుకోమంటూ చెప్పాడు. కాగా భర్త మహ్మద్ సలీంపై భార్య గుల్సబా కేసు పెట్టింది. అత్తయ్య సహా అత్తంటివారిలో పలువురిపై కేసు ఫిర్యాదు చేసింది. కట్నం కోసం భార్యపట్ల క్రూరంగా ప్రవర్తించిన కారణంగా అతడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా 2019 నుంచి దేశంలో ‘ట్రిపుల్ తలాక్’ చట్టవిరుద్ధంగా ఉంది.
Updated Date - 2023-11-02T12:41:10+05:30 IST