ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US President Joe Biden : బైడెన్‌ విల్మింగ్టన్‌ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు

ABN, First Publish Date - 2023-01-23T02:52:14+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ‘‘రహస్య పత్రాల’’ తలనొప్పి మరింత తీవ్రమయ్యేలా ఉంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్న ఆయనకు ఈ విషయం అడ్డంకిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరిన్ని రహస్య పత్రాల గుర్తింపు

13 గంటలపాటు సాగిన తనిఖీలు

వాషింగ్టన్‌, జనవరి 22: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ‘‘రహస్య పత్రాల’’ తలనొప్పి మరింత తీవ్రమయ్యేలా ఉంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్న ఆయనకు ఈ విషయం అడ్డంకిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. శనివారం ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ).. డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఉన్న బైడెన్‌ వ్యక్తిగత నివాసంలో తనిఖీలు చేసింది. 13 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో ఆరు రహస్య పత్రాలను గుర్తించింది. ఇవన్నీ బైడెన్‌ సెనేటర్‌, 8 ఏళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటివేనని పేర్కొంది. వీటిలో కొన్ని బైడెన్‌ చేతి రాతతో ఉన్నవి. ఇప్పటివరకు బైడెన్‌ ఒకప్పటి కార్యాలయాలు, వ్యక్తిగత నివాసాల్లో ఎఫ్‌బీఐ నాలుగు దఫాలుగా తనిఖీలు చేసింది. నవంబరు 2, డిసెంబరు 20, జనవరి 12న కూడా సోదాలు జరిగాయి. మొత్తం 18 రహస్య పత్రాలను గుర్తించి ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. వంతుల వారీగా సాగుతున్న తనిఖీల్లో వరుసగా రహస్య పత్రాలు బయటపడుతుండడం.. 2024 ఎన్నికల్లో బైడెన్‌ అభ్యర్థిత్వానికి నైతిక చిక్కులు తెచ్చి పెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రహస్య పత్రాల అంశాన్ని ప్రత్యర్థి పార్టీ రిపబ్లికన్లు ప్రచారాస్త్రంగా చేసుకుంటున్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్‌కు రహస్య పత్రాలను తనవద్ద ఉంచుకునే అధికారం లేదని గుర్తుచేస్తున్నారు. మొత్తం దర్యాప్తునే పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-01-23T02:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising