ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Usain Bolt: బోల్ట్‌కు టోకరా!

ABN, First Publish Date - 2023-01-20T02:08:37+05:30

జమైకాకు చెందిన ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ ఆర్థిక మోసానికి గురై భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరుగుల వీరుడి ఖాతాలోని

రూ.103 కోట్లు మాయం

మదుపు పెట్టిన కంపెనీలో

భారీ ఆర్థిక మోసం

కింగ్‌స్టన్‌, జనవరి 19: జమైకాకు చెందిన ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ ఆర్థిక మోసానికి గురై భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఆయన కోల్పోయిన మొత్తం 1.2 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.103 కోట్లు). పదవీవిరమణ-జీవితకాల సేవింగ్స్‌ కింద జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లోని స్టాక్స్‌ అండ్‌ సెక్యురిటీస్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎ్‌సఎల్‌) అనే పెట్టుబడుల సంస్థలో బోల్ట్‌ ఈ డబ్బులను మదుపు చేశారు. ఇప్పుడు చూస్తే ఆయన ఖాతాలో 12 వేల డాలర్లు (రూ.9.76 లక్షలు) మాత్రమే ఉన్నాయి. ఈ సొమ్మును కంపెనీ తిరిగి జమ చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బోల్ట్‌ తరఫు న్యాయవాది లింటన్‌.పి. గోర్డ్డాన్‌ హెచ్చరించారు. కంపెనీలో జరిగిన ఆర్థిక మోసానికి సంబంధించిన విషయాలను ఆయ న ఫార్చూన్‌ మేగజైన్‌ అనే పత్రికతో ఫోన్‌లో పంచుకున్నారు. పోయిన డబ్బు తిరిగి ఖాతాలోకి చేరి, మొత్తం వ్యవహారం సుఖాంతం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు.

Updated Date - 2023-01-20T08:30:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising