ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atiq Ahmad Killers: అతీఖ్ అహ్మద్ హంతకులపై వీహెచ్‌పీ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2023-04-17T17:30:18+05:30

ముగ్గురు హంతకులూ టర్కీలో తయారైన అత్యాధునిక జిగాన పిస్టళ్లను వాడారు.

Vishwa Hindu Parishad
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌లో(Prayagraj) గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్ అహ్మద్‌(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ (Ashraf)‌‌ను హత్య చేసిన లవ్లేశ్‌ తివారీ(Lovelesh Tiwari), సన్నీ సింగ్ (Sunny), అరుణ్‌ మౌర్యకు(Arun Maurya) తమ సంస్థతో ఎలాంటి సంబంధమూ లేదని విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad) స్పష్టం చేసింది. తమకు గానీ, భజరంగ్ దళ్‌కు కానీ ఎలాంటి సంబంధమూ లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ (VHP international working president Alok Kumar) తెలిపారు. దీనిపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. వీహెచ్‌పీ(VHP), భజరంగ్‌దళ్ (Bajrang Dal) భారత రాజ్యాంగం ప్రకారం నడచుకుంటాయని, చట్టాన్ని ఎప్పుడూ తమ చేతుల్లోకి తీసుకోలేదని చెప్పారు. విచారణలో సత్యాలు బయటపడతాయని అలోక్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోవైపు లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్యలను భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాగ్ రాజ్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు.

అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను ఈ నెల 15న ప్రయాగ్‌రాజ్‌లోని కెల్విన్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా.. లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్, అరుణ్‌ మౌర్య మెడలో మీడియా ఐడీ కార్డులు ధరించి, అక్కడకు చేరుకున్నారు. దుండగుల్లో ఒకడు అతీక్‌ కణతపై రివాల్వర్‌ను పెట్టి, ట్రిగ్గర్‌ నొక్కేశాడు. అతీక్‌ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే దుండగులు అష్రాఫ్‌ వైపు వచ్చి.. అతణ్నీ కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా.. కుప్పకూలిన ఆ ఇద్దరిపై కాల్పులను కొనసాగించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ ముగ్గురూ తమకు అతీక్‌తో ఉన్న పాతకక్షల వల్లే ఆ ఘాతుకానికి పాల్పడ్డట్లు అంగీకరించినట్లు తెలిసింది. అంతే కాదు ఈ హత్య ద్వారా మాఫియాలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవడం కూడా లక్ష్యమని విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇతర సమయాల్లో అతీక్‌ సామ్రాజ్యంలోకి ప్రవేశించడం కష్టమని, పోలీసులు వారిద్దరినీ జైలుకు తరలిస్తే మళ్లీ చాన్స్‌ దొరకదని చెప్పిట్లు సమాచారం. అందుకే మీడియా ముసుగులో అతీక్‌కు అతి సమీపానికి వచ్చాక.. ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు హంతకులూ టర్కీలో తయారైన అత్యాధునిక జిగాన పిస్టళ్లను వాడారు. మరో గ్యాంగ్‌స్టర్ సుందర్ భాటి (Sunder Bhati) నుంచి వీరు ఈ ఆయుధాలను సమకూర్చుకున్నట్లు సమాచారం. ఒక్కో పిస్టల్ ఖరీదు ఆరు లక్షలకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముగ్గురు హంతకులు కూడా పేద కుటుంబాల వారేనని, వారికి ఆ ఆయుధాలను కొనే ఆర్ధిక స్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అసలు విషయాలు బయటకు రానున్నాయి.

Updated Date - 2023-04-17T18:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising