ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Swara Vs Sadhvi : స్వర భాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-22T18:41:14+05:30

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker) పెళ్లిపై విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత సాధ్వి ప్రాచి (Sadhvi Prachi) సంచలన వ్యాఖ్యలు

Swara Bhaskar, Fahad Ahmed
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhasker) పెళ్లిపై విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత సాధ్వి ప్రాచి (Sadhvi Prachi) సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి ముందు ఓసారి ఫ్రిజ్ చూసుకోవలసిందన్నారు. ఇటీవల ఆఫ్తాబ్ పూనావాలా ఓ యువతిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి, ఫ్రిజ్‌లో పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

స్వర భాస్కర్ ఫిబ్రవరి 16న ఇచ్చిన ట్వీట్‌లో, ఫహద్ అహ్మద్‌తో తన పెళ్లి గురించి తెలిపారు. ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సాధ్వి ప్రాచి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, స్వర భాస్కర్ మొదటి నుంచి హిందూ మతానికి వ్యతిరేకేనని చెప్పారు. హిందువు కాని వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంటుందని తాను మొదటి నుంచి అనుకునేదాన్నని తెలిపారు. చివరికి ఆమె ఓ ముస్లింను పెళ్లాడిందన్నారు. బహుశా స్వర భాస్కర్ ఇటీవలి వార్తలపై దృష్టి పెట్టలేనట్లుందన్నారు. శ్రద్ధ వాకర్‌ను ఆఫ్తాబ్ హత్య చేసి, ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికినట్లు వచ్చిన వార్తలను ఆమె గమనించలేనట్లు కనిపిస్తోందన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆమె ఓసారి ఫ్రిజ్‌లోకి చూసి ఉండవలసిందన్నారు. పెళ్లి చేసుకోవడమనేది ఆమె వ్యక్తిగత నిర్ణయమేనని, శ్రద్ధకు జరిగినది స్వరకు కూడా జరగవచ్చునన్నారు.

ఇవి కూడా చదవండి :

Earthquake : ఢిల్లీలో భూకంపం

MCD Mayor Election: మేయర్‌ పీఠం ఆప్‌కే.. డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపు

Updated Date - 2023-02-22T19:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising