Viral News: నీతా అంబానీకి కాబోయే కోడలి బ్యాగ్ ధర ఎంతో తెలుసా..?
ABN, First Publish Date - 2023-04-02T20:07:14+05:30
రాధిక మర్చంట్..ముఖేష్, నీతా అంబానీకి కాబోయే కోడలు..ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో..
రాధిక మర్చంట్..ముఖేష్, నీతా అంబానీకి కాబోయే కోడలు..ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వుడ్బీ(Would be) అనంత్ అంబానీ కలిసి పాల్గొన్నారు. రాధిక మర్చంట్ నల్లటి ఇండో-వెస్ట్రన్ స్టైల్ చీరలో మెరిసిపోయింది. అయితే రాధిక మర్చంట్‌తోపాటు ఆమె చేతిలోని మినీ బ్యాగ్ కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ బ్యాగ్ ఫొటోలు, ప్రత్యేకతలు, ధర, ఇప్పుడు సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నాయి. ప్రత్యేకించి ఈ బ్యాగ్ ధరపై చర్చించుకుంటున్నారు.
వెండి రంగులో ఉన్న ఈ హెర్మేస్ కెల్లీమార్ఫోస్ మినీ బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్, సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు చైన్‌మెయిల్ బాడీ, షార్ట్‌స్ట్రాప్, క్లోచెట్‌తో కూడిన పొడవాటి భుజం గొలుసు ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాధికా మర్చంట్, అనంత్ జంట ముఖేష్ అంబానీ, నీతాఅంబానీలతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీతో కలిసి ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను ప్రారింభించిన ఈ జంట 'రఘుపతి రాఘవ రాజా రామ్' పాటకు నృత్యం చేశారు.
కాగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు బాలివుడ్ సినీ ప్రముఖులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే, సల్మాన్ ఖాన్, అలియా భట్ వంటి, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, అమెరికన్ మోడల్ జిగి హడిద్ హాజరయ్యారు.
Updated Date - 2023-04-02T20:11:04+05:30 IST