Vladimir Putin: జీ20 సదస్సుకి పుతిన్ దూరం.. అరెస్ట్ భయంతోనేనా.. క్లారిటీ ఇచ్చిన క్రెమ్లిన్
ABN, First Publish Date - 2023-08-25T18:24:52+05:30
భాతరదేశంలో సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ20 సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదని క్రెమ్లిన్ ప్రకటించింది. ఇందుకు కారణం..
భాతరదేశంలో సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ20 సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదని క్రెమ్లిన్ ప్రకటించింది. ఇందుకు కారణం.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధమేనని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ క్లారిటీ ఇచ్చారు. ‘‘జీ20 సమ్మిట్ కోసం వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవు. ప్రస్తుతం మా దృష్టి సైనిక చర్య మీదే ఉంది’’ అని దిమిత్రి పేర్కొన్నారు. అయితే.. ఈ సమ్మిట్‌లో పుతిన్ వర్చువల్‌గా పాల్గొంటారా? లేదా? అనే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదే సమయంలో వాగ్నర్ మెర్సినరీ అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఇదిలావుండగా.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి వ్లాదిమిర్ పుతిన్‌పై అనేక కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా.. ఉక్రెయిన్‌లోని పిల్లలను రష్యా అపహరించిందన్న ఆరోపణలపై ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన విదేశీ పర్యటనల్ని ఆపేశారు. ఒకవేళ విదేశాలకు పుతిన్ వెళ్తే.. ఆయన్ను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఈ కారణం వల్లే.. బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరు కాలేదు. కేవలం వర్చువల్‌గా మాత్రమే ఆ సదస్సుకు హాజరయ్యారు. ఇప్పుడు భారత్‌లో జరగబోయే జీ20 సమ్మిట్‌కు కూడా పుతిన్ వర్చువల్‌గా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే.. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కాగా.. ఈ ఏడాది జరగబోయే జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో ఈ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ఈ సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. ఈ సమ్మిత్ ముగింపులో G20 లీడర్స్ డిక్లరేషన్ ఆమోదించబడుతుంది.
Updated Date - 2023-08-25T18:24:52+05:30 IST