ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Waheeda Rehman: మహిళా బిల్లు రాగానే వహిదా రెహమాన్‌కు ఫాల్కే అవార్డు గర్వకారణం: అనురాగ్ ఠాకూర్

ABN, First Publish Date - 2023-09-26T14:54:33+05:30

ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్‌ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

న్యూఢిల్లీ: ప్రముఖ బహుభాషా నటి వహిదా రెహమాన్‌ (Waheeda Rehman) 2021 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award)కు ఎంపిక అయ్యారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ (Anurag Thakur) ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ సినిమాకు చేసిన విశిష్ఠ సేవలకు గాను వహిదా రెహమాన్‌ను ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేసినట్టు చెప్పారు. చారిత్రక మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన తరుణంలోనే ఫాల్కే అవార్డుకు వహిదా రెహమాన్‌ ఎంపిక కావడం గర్వకారణమని ఒక ట్వీట్‌లో అభినందనలు తెలిపారు.


''వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ప్యాసా, కాగజ్ కాఫూల్, చౌద్వి కా చాంద్, సాహెబ్ బీబీ ఔర్ గులామ్, గైడ్, ఖామోసి వంటి పలు హిందీ చిత్రాలు చేశారు. ఐదు దశాబ్దాల నట చరిత్రలో ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. ఆమె నటించిన రేష్మా అండ్ షెర చిత్రానికి జాతీయ ఉత్తత చిత్రం అవార్డు వచ్చింది. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. కఠోర పరిశ్రమ, వృత్తి నిబద్ధతతో భారతీయ మహిళా శక్తిని వహిదా చాటుకున్నారు. 'నారీ శక్తి వందన్' బిల్లును పార్లమెంటు ఆమోదించిన తరుణంలోనే ఆమెకు జీవిత సాఫల్య పురస్కారం రావడం అందరూ గర్వంచదగిన విషయం. సినిమాలు, ఫోటోగ్రఫీ, సమాజ సేవ వంటి రంగాల్లోనూ వహిదా తమ ప్రతిభను, సేవాభావాన్ని చాటుకున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు పేరుప్రతిష్టలు తెచ్చిన వారిలో ఒకరైన వహిదా రెహమాన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను'' అని అనురాగ్ ఠాకూర్ తన ట్వీట్‌లో తెలిపారు.


వహిదా రెహమాన్‌కు ఈ ఏడాది చివర్లో 'దాదాసాహెబ్ ఫాల్కే' జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఆమెకు ముందు భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి ఆశా ఫరేఖ్ ఈ అవార్డును అందుకున్నారు.

Updated Date - 2023-09-26T14:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising