ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Meenakshi lekhi: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి తెచ్చే పనిలోనే ఉన్నాం..

ABN, First Publish Date - 2023-10-08T15:25:18+05:30

ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చే పనిలో తాము ఉన్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ) ఆదివారంనాడు తెలిపారు. శనివారం ఉదయం నుంచి హమాస్ తీవ్రవాదులతో ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు జరుపుతోంది.

విజయవాడ: ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ (Israel)లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చే పనిలో తాము ఉన్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) ఆదివారంనాడిక్కడ తెలిపారు. శనివారం ఉదయం నుంచి హమాస్ తీవ్రవాదులతో ఇజ్రాయెల్ సైన్యం భీకర పోరు జరుపుతోంది.


"ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతదేశ విద్యార్థులను వెనక్కి తెచ్చేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రధాన మంత్రితో పాటు ఆయన కార్యాలయం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది'' అని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విదేశాల్లో చిక్కుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఆపరేషన్ గంగ కావచ్చు, వందే భారత్ కావచ్చు, ఎప్పుడు ఎక్కడ భారతీయులు చిక్కుకుపోయినా భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం అక్కడి ప్రజలతో నేరుగానే సంబంధాలు పెట్టుకుని, పరిస్థితిని సమీక్షించి సత్వర చర్యలు తీసుకుంటూనే ఉందన్నారు.


గాజా స్ట్రిప్ నుంచి హమాస్ తీవ్రవాదులు శనివారం భారీగా రాకెట్ దాడులు జరపడంతో భారతీయ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వయిజరీ జారీ చేసింది. ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల సూచనలకు అనుగుణంగా సేఫ్టీ ప్రోటోకల్ పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని, సేఫ్టీ షెల్టర్లలోనే ఉండాలని సూచనలు ఇచ్చింది. ఇజ్రాయెల్‌లో తీవ్రవాదుల దాడులు తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ క్లిష్ట కాలంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామని ఒక ట్వీట్‌లో భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-10-08T15:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising