ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajnath Singh: ఉగ్రవాదంపై సమష్టి పోరు సాగిద్దాం.. రాజ్‌నాథ్ పిలుపు

ABN, First Publish Date - 2023-04-28T13:30:06+05:30

ఉగ్రవాదంపై సమష్టి పోరాటం జరపాలని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణశాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై (Terrorism) సమష్టి పోరాటం జరపాలని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) రక్షణశాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ వేదికగా నిధుల వసూళ్లు (Crowd funding) వంటి కొత్త మార్గాలను ఉగ్రవాదులు ఎంచుకుంటున్నారనీ, ఈ నేపథ్యంలో కలిసికట్టుగా ఉగ్రవాదానికి ముకుతాడు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శుక్రవారంనాడిక్కడ ప్రారంభమైన ఎస్‌సీఓ రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ అన్నారు.

''ఉగ్రవాదంపై మనం ఐక్యంగా పోరాటం జరపాలి. ఎస్‌సీఓ బలమైన శక్తిగా నిలిస్తేనే మనం కలిసికట్టుగా పోరాడగలం. సామాజిక మాధ్యమాలు, క్రౌడ్ ఫండింగ్ వంటి కొత్త పద్ధతులను ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి'' అని రక్షణ మంత్రి తెలిపారు. ఎస్‌సీఓను పటిష్టంగా తయారుచేసేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని, ఎస్‌సీఏ తీర్మానాల అమలుకు తమ వంతు సహకారం అందిస్తుందని చెప్పారు.

ఆసక్తికరంగా, ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నిషేధిత పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (JeM) బహిరంగంగానే పెషావర్‌లో నిధులు వసూలు చేస్తోందంటూ యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ (UKPNP) వ్యవస్థాపకుడు సౌకత్ అలీ కశ్మీర్ ఇటీవల ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. పలు ఉగ్రదాడులకు ఈ జైషే ఉగ్రవాద సంస్థ కారణమని ఆయన అన్నారు. జైషే నిధుల సేకరణ కేవలం పెషావర్‌కే పరిమితం కాలేదు. ఇటీవల కాలంలో పంజాబ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK), ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు బహిరంగంగానే నిధుల వసూళ్లకు పాల్పడుతుండటంతో ఉగ్రవాద కార్యకలాపాలపై విరుచుకుపడే ప్రభుత్వ సామర్థ్యంపై ఆందోళనలు సైతం వ్యకమవుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రారంభమైన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

వర్చువల్ తరహాలో జరిగిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ప్రత్యేక సహాయకుడు మాలిక్ అహ్మద్ ఖాన్ సైతం పాల్గొన్నారు. 2023లో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన భారతదేశం శుక్రవారంనాడు జరిపిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. 2001లో ఇంటర్‌గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌గా ఎస్‌సీఏ ఏర్పాటైంది. ఇందులో ఇండియాతో పాటు కజకిస్థా్న్, చైనా, కిర్గిస్తాన్, పాకిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇబ్జర్వర్ దేశాలుగా బెలారస్, ఇరాన్‌లు ఉన్నాయి. 2017లో భారత్, పాక్ శాశ్వత సభ్యత్వ దేశాలుగా మారాయి.

Updated Date - 2023-04-28T13:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising