ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Luna-25: దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి రష్యా కీలక ప్రయోగం.. చంద్రయాన్-3 చేపట్టిన వారాల వ్యవధిలోనే...

ABN, First Publish Date - 2023-08-11T11:29:45+05:30

దాదాపు ఏడాన్నదిన్నర కాలంగా ఉక్రెయిన్‌ యుద్ధంలో తలమునకలైన రష్యా.. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి లునార్ మిషన్ ప్రయోగం చేపట్టింది. 1976 తర్వాత చంద్రుడిపైకి తొలిసారి లునా-25 (Luna-25) ప్రయోగించింది. మస్కో కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 2.10 గంటల సమయంలో వొస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టినట్టు రష్యన్ స్పేస్ ఏజెన్సీ ‘రొస్కోస్మోస్’ (Roscosmos) ప్రకటించింది.

మాస్కో: దాదాపు ఏడాదిన్నర కాలంగా ఉక్రెయిన్‌ యుద్ధంలో తలమునకలైన రష్యా.. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి లునార్ మిషన్ ప్రయోగం చేపట్టింది. 1976 తర్వాత చంద్రుడిపైకి తొలిసారి లునా-25 (Luna-25) గురువారం ప్రయోగించింది. మస్కో కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 2.10 గంటల సమయంలో వొస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టినట్టు రష్యన్ స్పేస్ ఏజెన్సీ ‘రొస్కోస్మోస్’ (Roscosmos) ప్రకటించింది.

దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి రష్యా మళ్లీ ప్రయోగం చేపట్టింది. జాబిల్లి దక్షిణ ధృవంపై ల్యాండింగే లక్ష్యంగా ‘లునా - 25’ పేరుతో రాకెట్‌ను ప్రయోగించింది. కేవలం 5 రోజుల్లోనే వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. జాబిల్లి దక్షిణ ధృవంపై ల్యాండవ్వడమే లక్ష్యంగా అనువైన ప్రాంతం ఎంపిక కోసం 3-7 రోజులపాటు కక్ష్యలోనే భ్రమించనుంది.

‘‘ చరిత్రలో మొట్టమొదటిసారి చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ జరగనుంది. ఇప్పటివరకు అందరూ చంద్రుడి మధ్యమండలానికి సమీపంలో ల్యాండింగ్ చేశారు’’ అని రొస్కోస్మోస్ సీనియర్ అధికారి అలెగ్జాండర్ బ్లాఖిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా రష్యా ప్రయోగించిన లునా-25 వ్యోమనౌక ఆగస్టు 21న చంద్రుడిపై ల్యాండవనుందని రొస్కోస్మోస్ వర్గాలు వెల్లడించాయి.

ఈ వ్యోమనౌక దాదాపు ఏడాదిపాటు చంద్రుడి మీదనే ఉండనుంది. చంద్రుడిపై నమూనాల సేకరణ, అక్కడి మట్టిని విశ్లేషించడం, దీర్ఘకాలంపాటు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టనున్నట్టు రష్యన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రష్యా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం గమనార్హం.


చంద్రయాన్-3ని లునా-25 ఢీకొడుతుందా?..

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం జులై 14న జరిగింది. ఆ ప్రయోగం జరిగిన వారాల వ్యవధిలోనే రష్యా కూడా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ లక్ష్యంగా ప్రయోగం చేపట్టడడం గమనార్హం. చంద్రయాన్-3 వ్యోమనౌక కంటే ముందే లునా-25 జాబిల్లిపై ల్యాండవ్వనుండడం గమనార్హం. ఆగస్టు 21న అడుగుపెట్టనున్నట్లు రోస్‌కాస్మోస్‌ అధికారులు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా సరికొత్త చరిత్రను సృష్టించాలని ఎదురుచూస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు రష్యా ఒక రకంగా పోటీనిస్తోందని చెప్పాలి. ఇక చంద్రుడి దక్షిణ ధృవంపైనే ల్యాండింగ్ కానున్నప్పటికీ ఈ రెండు వ్యోమనౌకలు ఢీకొట్టుకునే అవకాశం లేదు. ల్యాండింగ్ లక్షిత ప్రాంతాలు వేర్వేరు కావడం ఇందుకు కారణమని రష్యా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - 2023-08-11T11:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising