ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కోకపోతే ఆ తర్వాతేంటి? ఈ మూన్ మిషన్ ఏమవుతుంది?

ABN, First Publish Date - 2023-09-23T15:17:54+05:30

ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 ప్రాజెక్ట్ మీదే ఉంది. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అవ్వడంతో.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కొంటాయా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు...

ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 ప్రాజెక్ట్ మీదే ఉంది. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అవ్వడంతో.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కొంటాయా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు శుక్రవారం వాటిని నిద్రావస్థ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. కానీ.. ఆ రెండింటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. అయితే.. వాటితో కాంటాక్ట్ అయ్యేంతవరకు తమ ప్రయత్నాలను తాము కొనసాగిస్తామని ఇస్రో వెల్లడించింది. ‘‘ల్యాండర్, ప్రజ్ఞాన్‌ మేల్కొనే పరిస్థితిని నిర్ధారించడం కోసం.. ఆ రెండింటితో కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, వాటి నుంచి సంకేతాలు అందలేదు. అయితే.. వాటితో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతాయి’’ అంటూ ఇస్రో ట్వీట్ చేసింది.


ఇంతకీ.. ల్యాండర్, రోవర్ మేల్కోకపోతే ఆ తర్వాతేంటి? అక్కడితో ఈ మిషన్ ఇక కంప్లీట్ అయినట్టే లెక్క. అయితే.. ఈ చంద్రయాన్-3 మాత్రం ‘ఇండియా లూనార్ అంబాసిడర్’గా ఎప్పటికీ చంద్రుని ఉపరితలంపై నిలిచిపోతుందని ఇస్రో చెప్పింది. అంతకుముందు ల్యాండర్, రోవర్‌లను స్లీప్ మోడ్‌లోకి పంపించినప్పుడు.. రోవర్ తన అసైన్‌మెంట్లను పూర్తి చేసిందని ఇస్రో వెల్లడించింది. ఒక చోట అది సేఫ్‌గా పార్క్ చేయడిందని, రోవర్‌తో పాటు APXS, LIBS పేలోడ్స్ సైతం ఆఫ్ చేయబడ్డాయని పేర్కొంది. ప్రస్తుతానికి బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ అయ్యాయని, సెప్టెంబర్ 22వ తేదీన చంద్రునిపై సూర్యోదయం అయ్యాక సోలార్ ప్యానెల్ కాంతిని అందుకోవడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపింది. రిసీవర్ ఆన్‌లోనే ఉందని, ఈ మిషన్ మళ్లీ తిరిగి మేల్కొంటుందని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చింది. కానీ.. అప్పుడు ఆశించినట్టుగా ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలు అందలేదు.

ఒకవేళ ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కొంటే మాత్రం.. చంద్రయాన్-3 పేలోడ్స్ ద్వారా మరోసారి నిర్వహించే ప్రయోగాల నుంచి పొందే సమాచారం బోనస్ అవుతుంది. ప్రస్తుతం చంద్రునిపై నీటి ఉనికిని నిర్ధారించడం ముఖ్యమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే చంద్రునిపై ఆక్సిజన్ ఉనికిని ఈ ప్రాజెక్ట్ చూపించింది. ఇక హైడ్రోజన్‌ను కూడా గుర్తించగలిగితే.. చంద్రునిపై నీరు ఉందని రుజువు అవుతుంది. ఏదేమైనా.. ఇస్రో ప్రకారం ఈ చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది. 14 రోజుల నిడివిలో.. 10 రోజుల్లోనే ల్యాండర్, రోవర్‌లు తమ పనిని పూర్తి చేశాయి. చంద్రుని ఉపరితలానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారాల్ని అందించాయి. మరో గర్వించదగిన విషయం ఏమిటంటే.. మొట్టమొదటిసారిగా దక్షిణ ధ్రువంపై ఈ చంద్రయాన్-3 మిషన్ సేఫ్ ల్యాండింగ్ చేయడంతో, ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది.

Updated Date - 2023-09-23T15:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising