ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nithari Killings: అసలేంటి ఈ నిఠారీ వరుస హత్యల కేసు.. ఆ ఇద్దరు నిర్దోషులుగా ఎలా బయటపడ్డారు?

ABN, First Publish Date - 2023-10-16T22:38:52+05:30

2006లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో తాజాగా అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషులుగా తేలి మరణశిక్షను ఎదుర్కొంటున్న సురేందర్‌ కోలీ...

2006లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో తాజాగా అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషులుగా తేలి మరణశిక్షను ఎదుర్కొంటున్న సురేందర్‌ కోలీ, మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్లే వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తన తీర్పు వెల్లడించింది. దీంతో.. ఆ ఇద్దరి మరణశిక్ష రద్దయ్యింది. ఇకపై వాళ్లు తమ పాత జీవితాన్నే తిరిగి పునఃప్రారంభించనున్నారు.


అసలు ఈ నిఠారీ వరుస హత్యల కేసు ఏంటి?

నోయిడాలోని నిఠారీ గ్రామంలో మానిందర్‌ సింగ్‌ పంధేర్‌ అనే వ్యాపారవేత్త నివసిస్తున్నాడు. ఇతని ఇంటి సమీపంలోనే ఒక మురికి కాలువ ఉంది. 2006 డిసెంబర్ 29వ తేదీన ఆ కాలువలో కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురై, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మానవ అవశేషాలు ఎవరివి? ఆ మురికి కాలువలోకి ఎలా వచ్చాయి? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అప్పుడే వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా.. పంధేర్‌ ఇంటి వెనుక పెరట్లో అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఆ దొరికిన అవశేషాలు ఎవరివి? అనే కోణంలో విచారణ చేపట్టగా.. 2005-2006 మధ్యకాలంలో ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులకు సంబంధించినవి అని తేలింది.

ఆ సమయంలో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. అప్పుడు మరిన్ని ఒళ్లు గగుర్పొడిచే విషయాలు తెరమీదకు వచ్చాయి. పంధేర్‌ ఇంట్లో పనిచేసే సురేందర్‌ కోలీ అనే వ్యక్తి.. స్థానిక చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లేవాడని తేలింది. అనంతరం వాళ్లను దారుణంగా హత్య చేసి, ఆపై మృతదేహాలపై లైంగిక దాడికి పాల్పడేవాడని నిర్ధారణ అయ్యింది. తమ కామవాంఛ తీరిన తర్వాత ఆ మృతదేహాలను ఇంటి వెనుక భాగంలో విసిరేశారని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది. అప్పట్లో ఈ ఘటనకు సంబంధించి ఆ ఇద్దరిపై 19 కేసులు నమోదు చేశారు. అయితే.. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మూడు కేసులు మూసివేశారు. మిగిలిన 16 కేసుల్లో ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. వీటిల్లోని కొన్ని కేసుల్లో సురేందర్‌ కోలీని కోర్టు దోషిగా తేల్చి, అతనికి మరణశిక్ష విధించింది. అటు.. పంధేర్‌ కొన్ని కేసుల్లో నిర్దోషిగా తేలినా, రెండు కేసుల్లో దోషిగా తేలడంతో అతనికీ ఉరిశిక్ష విధించింది.


మరణశిక్ష ఎలా రద్దు అయ్యింది?

తమకు ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ కోలీ (12 కేసులు), పంధేర్ (2 కేసులు) అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై కోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. చివరికి సోమవారం న్యాయస్థానం తన తుది తీర్పుని వెల్లడిస్తూ.. ఆ ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. 14 కేసుల్లో ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడం వల్లే నిర్దోషులుగా ప్రకటించినట్టు కోర్టు తెలిపింది. అయితే.. ఈ తీర్పుపై సీబీఐ సంతృప్తిగా లేదు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీబీఐ తెలిపింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగానే కోలీకి ఉరిశిక్ష విధించడాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు ఆమోదించాయని సీబీఐ న్యాయవాది సంజయ్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు తీర్పు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఈ తీర్పుని అధ్యయనం చేసిన తర్వాత సీబీఐ లీగల్ టీమ్ దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సిఫార్సు చేయనుంది.

Updated Date - 2023-10-16T22:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising