ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan: సీఎం శర్మ, ఆయన డిప్యూటీలపై ఆసక్తికర విశేషాలు..

ABN, Publish Date - Dec 15 , 2023 | 03:46 PM

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎకాఎకిన సీఎం పీఠాన్ని చేపట్టిన ఘనత భజన్‌లాల్ శర్మకు దక్కుతుంది. రాజస్థా్న్ కొత్త ముఖ్యమంత్రిగా ఆయన శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లోని రామ్‌నివాస్‍ బాగ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు.

జైపూర్: తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎకాఎకిన సీఎం పీఠాన్ని చేపట్టిన ఘనత భజన్‌లాల్ శర్మ (Bhajan Lal Sharma)కు దక్కుతుంది. రాజస్థా్న్ (Rajasthan) కొత్త ముఖ్యమంత్రిగా ఆయన శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లోని రామ్‌నివాస్‍ బాగ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నేతలు దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర ప్రముఖ నేతలు హాజరయ్యారు.


సీఎం, డిప్యూటీ సీఎంల విశేషాలు..

-భరత్‌పూర్‌లోని అటారీ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో భజన్‌లాల్ (56) జన్మించారు. తన సొంత తహసిల్ నద్‌బయిలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఆయన చదువుకున్నారు. 1989లో మహారాణి శ్రీ జయ ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఆయన బీజేపీ యువజన విభాగమైన ఏబీవీపీలో చేరారు. భరత్‌పూర్ జిల్లా కో-కన్వీనర్‌గా కూడా సేవలందించారు. 1994లో 27 ఏళ్ల వయస్సులోనే ఆయన అటారి గ్రామ సర్పంచ్ అయ్యారు. రెండు సార్లు ఇదే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత కూడా పార్టీలో వివిధ పదవుల్లో పనిచేశారు. మండల అధ్యక్షుడిగా, రెండు మూడు సార్లు రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా సేవలు అందించారు.


దియాకుమారి: జైపూర్‌ను పాలించిన చిట్టచివరి మహారాజు మాన్ సింగ్-2 మనుమరాలు. 2013లో బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. 2013లో సవాయ్ మథోపూర్‌ నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఆమె రాజకీయ జర్నీ విజయవంతంగా మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి దేవకినందన్ కాకాపై 5,51,916 ఓట్ల భారీ ఆధిక్యంతో అఖండ విజయం సాధించింది. దీంతో ఆమె పార్లమెంటు సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.


ప్రేమ్‌ చంద్ భైర్వా: డుడు విధాన్ సభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 54 ఏళ్ల ప్రేమ్‌ చంద్ భైర్వా ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి బాబూలాల్ నగర్‌పై 35,743 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి భైర్వా ఓటమిని చవిచూశారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బాబూ లాల్ నగర్ 14,799 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

Updated Date - Dec 15 , 2023 | 03:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising