ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WHO alert:ఆ రెండు దగ్గు సిరప్‌లను ఉపయోగించొద్దు...డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు

ABN, First Publish Date - 2023-01-12T08:17:53+05:30

భారత్ దేశ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది....

WHO issues alert
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్ దేశ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేసింది.ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది పిల్లల మరణాలకు భారతదేశానికి చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమైన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సిఫారసు చేసింది.దగ్గు సిరప్ లైన అబ్రోనాల్ (AMBRONOL), డీఓకే-1 (DOK-1) మాక్స్ సిరప్ లలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ ఎక్కువగా ఉందని లాబొరేటరీ విశ్లేషణలో తేలినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారుచేసిన సిరప్ లు తాగడం వల్ల తమ దేశంలో 18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైన మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసింది.

Updated Date - 2023-01-12T08:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising