ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shahid Latif: ఆ పాకిస్తాన్ ఉగ్రవాదిని భారత్ ఎందుకు విడిచిపెట్టింది?

ABN, First Publish Date - 2023-10-13T19:30:09+05:30

భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన ఉగ్రవాదుల్లో ఒకరైన షాహిద్ లతీఫ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో అక్టోబర్ 11వ తేదీన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్పులు...

భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన ఉగ్రవాదుల్లో ఒకరైన షాహిద్ లతీఫ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో అక్టోబర్ 11వ తేదీన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపి లతీఫ్‌ను హతమార్చారు. అక్టోబర్ 11న లతీఫ్ నమాజ్ చేసి, తన సహచరులతో కలిసి బయటకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మోటార్ సైకిల్‌పై ముగ్గురు వ్యక్తులు వచ్చి.. లతీఫ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో లతీఫ్‌తో పాటు అతని ఇద్దరు సహచరులు అక్కడికక్కడే మృతి చెందారు. సియాల్‌కోట్ పోలీసులు ఈ హత్యను ధృవీకరించి.. ఈ హత్య ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.

అసలు షాహిద్ లతీఫ్ ఎవరు?

షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలా నగరంలో నివాసం ఉండేవాడు. 1970లో జన్మించిన అతను జైష్-ఏ-మహ్మద్‌ అనే తీవ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాడు. 2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పఠాన్‌కోట్ దాడుల్లో లతీఫ్ ప్రమేయం ఉంది. పాకిస్తాన్‌లో కూర్చొనే, అతడు ఈ దాడికి ప్లాన్ చేశాడు. జైష్-ఏ-మహ్మద్ లాంచింగ్ కమాండర్‌గా ఎదిగిన అతడు.. నలుగురు ఉగ్రవాదులతో సమన్వయం చేసుకొని, పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడి చేసేందుకు పంపాడు. అప్పటి నుంచి అతడ్ని పట్టుకోవడం కోసం జాతీయ దర్యాప్తు సంస్థ అంతర్జాతీయంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. చివరికి అతడు దుండగుల దాడుల్లో మృతి చెందాడు.


అసలు భారత ప్రభుత్వం ఎందుకు లతీఫ్‌ని విడిచిపెట్టింది?

నిజానికి.. భారత ప్రభుత్వం లతీఫ్‌ను 1994లోనే అరెస్ట్ చేసింది. 1993లో పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా అక్రమంగా జమ్ముకశ్మీర్‌లో చొరబడిన అతగాడు.. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఉగ్రవాద ఆరోపణలపై 1994లో అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి 16 ఏళ్ల పాటు.. అంటే 2010 వరకు జమ్ము కోట్ బల్వాల్‌లో జైలు జీవితం గడిపాడు. 2010లో భారత ప్రభుత్వం లతీఫ్‌తో పాటు మరో 24 మంది ఉగ్రవాదులను విడుదల చేసింది. వారిని అలా విడుదల చేయడానికి ఒక బలమైన కారణం ఉంది.

1999 డిసెంబర్ 24వ తేదీన ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానం బయలుదేరింది. అయితే.. ఈ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్ విమానాశ్రయంలో దింపారు. ఈ విమానంలో 15 మంది సిబ్బందితో పాటు 176 మంది ప్రయాణికులున్నారు. ఉగ్రవాదులు తమ 25 మంది సహచరులను విడుదల చేయాలని కోరారు. ఆ 25 మందిలో లతీఫ్ కూడా ఉన్నాడు. వీరిని విడుదల చేయడంతో పాటు 200 మిలియన్ డాలర్ల విమోచన క్రయధనాన్ని సైతం డిమాండ్ చేశారు.

అయితే.. అప్పుడు భారత ప్రభుత్వం లతీఫ్‌ని విడుదల చేయలేదు. జేష్-ఏ-మహ్మద్ చీఫ్‌తో పాటు మరో ఇద్దరిని విడుదల చేశారు. 2010లో లతీఫ్ శిక్ష పూర్తయ్యింది. దీంతో.. అతడ్ని వాఘా మీదుగా పాకిస్తాన్ పంపించారు. మార్పు వస్తుందని భావిస్తే.. మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలుపెట్టాడు. ఆరేళ్ల తర్వాత అంటే 2016లో పఠాన్‌కోట్‌ దాడికి పాల్పడ్డాడు. బహుశా అతని శిక్షను మరింతగా పెంచి ఉంటే, పఠాన్‌కోట్ దాడులు జరిగేవి కావు.

Updated Date - 2023-10-13T19:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising