ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Siddaramaiah: బోకేలు, శాలువాలు స్వీకరించనన్న సీఎం సిద్ధరామయ్య

ABN, First Publish Date - 2023-05-22T14:15:00+05:30

బెంగళూరు: ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన రెండు గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 హామీల ఫైలుపై తొలి సంతకం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆడంబరాలకు దూరంగా ఉండాలనే మరో నిర్ణయం తీసుకున్నారు. బోకేలు, శాలువాలను తాను స్వీకరించేది లేదని, అంతగా తనపై ఉన్న ప్రేమను చాటుకోవాలనుకుంటే మంచి పుస్తకాలు ఇస్తే చాలని అన్నారు. తన అధికారలో ట్విట్టర్‌ ఖాతాలో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.

బెంగళూరు: ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన రెండు గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 హామీల ఫైలుపై తొలి సంతకం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆడంబరాలకు దూరంగా ఉండాలనే మరో నిర్ణయం తీసుకున్నారు. బోకేలు, శాలువాలను తాను స్వీకరించేది లేదని, అంతగా తనపై ఉన్న ప్రేమను చాటుకోవాలనుకుంటే మంచి పుస్తకాలు ఇస్తే చాలని అన్నారు. తన అధికారలో ట్విట్టర్‌ ఖాతాలో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. వ్యక్తిగతంగా తనను కలుసుకునేందుకు వచ్చేవారు, పబ్లిక్ ఈవెంట్స్‌లో గౌరవ సూచికంగా బోకోలు, శాలువాలు ఇస్తుంటారని, అయితే వాటిని తాను స్వీకరించరాదని నిర్ణయించుకున్నట్టు ఆ ట్వీట్‌లో చెప్పారు. ఎవరైనా బహుమతుల రూపంలో తమ గౌరవాన్ని చాటుకోవాలనుకుంటే పుస్తకాలు ఇస్తే చాలని అన్నారు. తనపై ప్రజలకున్న అభిమానం, ప్రేమ ఇలాగే కొనసాగాలని ఆశిస్తు్నట్టు పేర్కొన్నారు.

జీరో ట్రాఫిక్ ప్రోటాకాల్ వెనక్కి...

కాగా, తన కోసం పాటిస్తున్న 'జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌'ను వెనక్కి తీసుకోవాలని కూడా సిద్ధరామయ్య బెంగళూరు పోలీసులను ఆదేశించారు. జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ కారణంగా ప్రజలు రోడ్లపై ఎదుర్కొంటున్న సమస్యలు చూసిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు సీఎం ట్వీట్ చేశారు.

కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య గత శనివారంనాడు బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా, మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, విపక్ష ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరయ్యారు.

Updated Date - 2023-05-22T14:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising