Yogi Adityanath: యూపీ ఇప్పుడు పండుగలకు, ఉత్సవాలకు నిలయమైంది
ABN, First Publish Date - 2023-04-24T22:43:55+05:30
షహరాన్‌పూర్‌లో ఆయన పురపాలక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మాఫియాపై (Mafia) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శాంతిభద్రతలు మెరుగయ్యాయని, మాఫియా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. రాష్ట్రంలో అల్లర్లు లేవని, కర్ఫ్యూలు విధించడం లేదని మరోసారి గుర్తు చేశారు. షహరాన్‌పూర్‌లో ఆయన పురపాలక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆడబిడ్డలు బయటకు రావాలంటే భయపడేవారని, ఇప్పుడు భయరహిత వాతావరణం ఏర్పడిందని యోగి చెప్పారు. ప్రస్తుతం యూపీ పండుగలకు, ఉత్సవాలకు నిలయంగా మారిందన్నారు. యూపీలో ఇకపై కబ్జాలుండబోవన్నారు.
యూపీలో ఇటీవలే గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు. అంతకు ముందు అతీఖ్ తనయుడు అసద్, అతడి స్నేహితుడు గులామ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షి అయిన న్యాయవాది ఉమేశ్ పాల్‌ను ఫిబ్రవరిలో అసద్‌తో పాటు మరో 9 మంది హత్య చేశారు. వీరిలో ఆరుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
Updated Date - 2023-04-24T22:45:41+05:30 IST