Sanskrit: సంస్కృతంలో ముస్లిం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ABN, Publish Date - Dec 23 , 2023 | 01:40 PM
సాధారణంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ మాతృ భాష లేదంటే ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. కానీ రాజస్థాన్(Rajasthan)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సంస్కృతంలో(Sanskrit) ప్రమాణ స్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
జైపుర్: సాధారణంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ మాతృ భాష లేదంటే ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. కానీ రాజస్థాన్(Rajasthan)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సంస్కృతంలో(Sanskrit) ప్రమాణ స్వీకారం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
అందులోనూ ఎమ్మెల్యేలిద్దరూ ముస్లింలు కావడం ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జుబేర్ ఖాన్ విజయం సాధించారు. తాజాగా రాజస్థాన్ అసెంబ్లీలో స్పీకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే జుబేర్ ఖాన్ పోడియం దగ్గరికి వచ్చి సంస్కృతంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ(BJP) టిక్కెట్ నిరాకరించడంతో యూనుస్ ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆయన మాజీ సీఎం వసుంధర రాజేకి సన్నిహితుడు. ఎన్నికల్లో గెలుపొందిన ఆయన సంస్కృతంలో ప్రమాణం చేసి ఆకట్టుకున్నారు. ఆ భాషలోనే ఎందుకు ప్రమాణం చేశారని వారిని అడగ్గా... అంతరించి పోతున్న భాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా తమపై ఉందని చెప్పారు. వీరిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Updated Date - Dec 23 , 2023 | 01:40 PM