ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prakriti Rao : ఆమె అవసరం... ఇప్పుడొక బ్రాండ్‌

ABN, First Publish Date - 2023-03-05T23:45:53+05:30

ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంది మహిళలు నైటీనో... లేదా పాత పైజమానో వేసుకుంటారు. ఇంట్లో కూడా మంచి దుస్తులు వేసుకోవటమనేది మన సంస్కృతిలో భాగం కాదు. కానీ పాశ్చాత్య సంస్కృతిలో ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవటానికి లాంజ్‌వేర్‌.. రాత్రి ధరించటానికి నైట్‌వేర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంది మహిళలు నైటీనో... లేదా పాత పైజమానో వేసుకుంటారు. ఇంట్లో కూడా మంచి దుస్తులు వేసుకోవటమనేది మన సంస్కృతిలో భాగం కాదు. కానీ పాశ్చాత్య సంస్కృతిలో ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవటానికి లాంజ్‌వేర్‌.. రాత్రి ధరించటానికి నైట్‌వేర్‌.. ఇలా రకరకాల దుస్తులు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి లాంజ్‌వేర్‌ను దేశంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన వాణిజ్యవేత్త ప్రకృతిరావు. ఆమె స్థాపించిన ‘కఫ్తాన్‌ లాంజ్‌వేర్‌’ ఒక ఫ్యాషన్‌ బ్రాండ్‌గా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ బుధవారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకృతిరావు ప్రస్థానం ఆమె మాటల్లోనే...

‘‘మన దేశంలో రకరకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వాటికి తగినట్లుగా వస్త్రాలను నేస్తారు, కుడతారు. మన దేశ వాతావరణ పరిస్థితులకు కాటన్‌, లినెన్‌లు సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా ఒకో ప్రాంతంలో ఒకో విధమైన వస్త్రాలు ధరిస్తారు. దక్షిణ భారత దేశంలో చీరలు కట్టుకుంటే.. ఉత్తర భారతదేశంలో సల్వార్‌ కమీజ్‌లు వేసుకుంటారు. ఇదే మన దేశ వైవిధ్యం. దీనికి తగ్గట్టుగా మోడల్స్‌ను తయారుచేయాలి. అయితే మార్పు కూడా ఒక్క రోజులో రాదు. నెమ్మనెమ్మదిగా వస్తుంది. మీకో ఉదాహరణ చెబుతాను. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరగాను. సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఎక్కువ మంది మహిళలు చీరలే కట్టుకొనేవారు. ఆ తర్వాత నెమ్మదిగా సల్వార్‌ కమీజ్‌లు వేసుకోవటం మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడు దుపట్టా లేకుండా వేసుకుంటున్నారు. వీరందరినీ కొత్త రకం దుస్తులు వేసుకోమంటే వేసుకోరు. కానీ వీరిని ప్రభావితం చేయటం అంత కష్టం కూడా కాదు. టీవీ సీరియల్స్‌, బాలీవుడ్‌ స్టార్స్‌ ఫొటోలు, ఇంటర్నెట్‌లో ఇన్‌ప్లూయనర్స్‌ వల్ల ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ మారిపోతున్నాయి. ఒక బ్రాండ్‌ బాగా పెరగాలంటే ఆన్‌లైన్‌ మోడల్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉండాలి. అప్పుడే ఆ బ్రాండ్‌కు మంచి డిమాండ్‌ వస్తుంది.

‘‘మాది మధ్యతరగతి కుటుంబం. బాగా చదువుకున్న తర్వాత విదేశాల్లో కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేశా. 2010లో నాకు కేన్సర్‌ వచ్చింది. ఆ సమయంలో డాక్టర్లు నన్ను లూజుగా ఉన్న దుస్తులు వేసుకొమ్మని సలహాఇచ్చారు. అలాంటి దుస్తుల కోసం మార్కెట్లన్నీ వెతికా. కానీ నాకు బయటకు వేసుకొని వెళ్లగలిగినవి దొరకలేదు. నాలాగే ఇబ్బంది పడేవారు అనేకమంది ఉన్నారనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘కఫ్తాన్‌’. కఫ్తాన్‌ అనేది ఒక రకమైన డ్రస్సు. సుమారు ఏడు దశాబ్దాల క్రితం దీన్ని ఎక్కువ మంది వాడేవారు. ఆ తర్వాత దీనికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయింది. పాశ్చాత్య దేశాల్లో ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవటానికి ‘లాంజ్‌వేర్‌’ అని.. రాత్రిళ్లు వేసుకోవటానికి ‘నైట్‌వేర్‌’ అని వేర్వేరుగా దుస్తులు ఉంటాయి. మన దేశంలో ఈ పద్ధతి లేదు. అందువల్ల కఫ్తాన్‌ను లాంజ్‌వేర్‌ మాదిరిగా మన దేశంలో ప్రవేశపెట్టాం.

సవాళ్లు అనేకం...

మన దేశంలో కఫ్తాన్‌ లాంటి లాంజ్‌వేర్‌ను కేవలం ఉన్నత వర్గాల వారు మాత్రమే ధరించేవారు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్లినప్పుడు కొనుక్కొని తెచ్చుకొనేవారు. ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు ఇవి అందుబాటులో ఉండేవి కావు. మేము ఆ వర్గాల ప్రజలకు కూడా ఇవి అందుబాటులో ఉండాలనుకున్నాం. అందరికీ అందుబాటులో ఉన్న ధరలలో.. రకరకాల మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చాం. మేము ఈ మోడల్స్‌ ప్రవేశపెట్టే సమయానికి కొవిడ్‌ వచ్చింది. వ్యాపారం తగ్గింది. కానీ అదే సమయంలో మా మోడల్స్‌ను అందరి దగ్గరకు తీసుకువెళ్లగలిగే అవకాశాన్ని ఇచ్చింది. కొవిడ్‌ సమయంలో ఎక్కువ మంది ఇళ్ల నుంచే పని చేయటం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేవారు. సాధారణంగా చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు, పైజమా టీషర్ట్‌లు వేసుకుంటారు. కానీ వీడియో కాల్స్‌ ద్వారా మీటింగ్‌లలో పాల్గొనాలంటే ఈ దుస్తులు బావుండవు. మళ్లీ దుస్తులు మార్చుకోవాలి. కానీ మా కఫ్తాన్‌ను వాడితే ఆ ఇబ్బంది ఉండదు. అందువల్ల మా బ్రాండ్‌ అందరికీ చాలా సులభంగా చేరువయింది. కొవిడ్‌ సమయంలో మా టర్నోవర్‌ 200 శాతం పెరిగిందంటే... ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. మేము మార్కెట్‌లో మోడల్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత స్థానికంగా అనేక కంపెనీలు వీటిని తయారుచేయటం మొదలుపెట్టాయి. నా ఉద్దేశంలో ప్రస్తుతం సుమారు వెయ్యి కంపెనీలు కఫ్తాన్‌లను తయారు చేస్తున్నాయి.

సమస్యలెన్నో...

దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అనేక సమస్యలు ఉంటాయి. వీటిలో మొదటిది సరైన నెట్‌వర్క్‌ లేకపోవటం. సాధారణంగా టెక్స్‌టైల్స్‌ రంగం అంతా పురుషులతోనే నిండి ఉంటుంది. వారి నెట్‌వర్క్‌ను ఛేదించటం అంత సులభం కాదు. ఏవైనా సమావేశాలకు వెళ్లినప్పుడు నేను ఒంటరిగా ఉన్నాననే భావన కలిగేది. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి వారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించటానికి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నా. దీనివల్ల నాకు అనేక మంది మహిళా వాణిజ్యవేత్తలతో పరిచయమయింది. నేను ఒంటరి కాదనే భరోసా కలిగింది. ఈ కార్యక్రమం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. ఇదే విధంగా టెక్స్‌టైల్స్‌ రంగం చాలా సంక్లిష్టమైనది. వినియోగదారులకు నచ్చే దుస్తులను.. మోడల్స్‌ను తయారు చేయటం అంత సులభమైన విషయం కాదు. మొదట్లో అనేక ఎగ్జిబిషన్లకు వెళ్లేదాన్ని. అనేక మంది చేనేత కార్మికులను కలిసేదాన్ని. చాలా మంది ఆన్‌లైన్‌లో ఫొటోలు చూసి వస్ర్తాన్ని ఎంపిక చేయవచ్చని అనుకుంటారు. కానీ క్లాత్‌ను పట్టుకుని చూస్తే తప్ప దాని మంచి చెడ్డలు తెలియవు. నాకు ఆ నైపుణ్యం రావటానికి రెండు మూడేళ్లు పట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మా మోడల్స్‌తో పాటు అనేక కొత్త మోడల్స్‌ ప్రవేశ పెట్టాలని భావిస్తున్నాం.’’

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-03-05T23:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising