ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Subhasitham : శ్రేయోదాయకాలు

ABN, First Publish Date - 2023-12-08T03:39:26+05:30

మనిషికి మంచిని చేకూర్చే ఆదర్శప్రాయమైన జీవనవిధానం గురించి తన నీతి శతకంలోని ఒక శ్లోకంలో భర్తృహరి ఇలా వివరించాడు.

మనిషికి మంచిని చేకూర్చే ఆదర్శప్రాయమైన జీవనవిధానం గురించి తన నీతి శతకంలోని ఒక శ్లోకంలో భర్తృహరి ఇలా వివరించాడు.

ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం

కాలే శక్త్యా ప్రదానం యువతిజనకథా మూకభావః పరేషామ్‌

తృష్ణా స్రోతో విభంగో గురుషు చ వినయః సర్వ భూతానుకంపా

సామాన్యః సర్వ శాస్త్రేష్వనుపహత విధిః శ్రేయసామేష పంథాః

దాన్ని...

పరహింసా పరకీయ విత్త హరణాభావంబు, సత్యవ్రతా

దరముం, దాన పరత్వమన్య వనితో దంతోక్తి మూకత్వమున్‌,

బరతృష్ణాఝర భంజనంబు గురు నమ్రత్వ బునుం భ్రాణభృ

త్కరుణాశాస్త్ర సమత్వసద్విధుల్‌ భద్ర ప్రాప్తికిన్‌ మార్గముల్‌... అంటూ సుమధురమైన తెలుగు పద్యంగా ఏనుగు లక్ష్మణకవి తీర్చిదిద్దాడు.

భావం: జీవహింస చేయకుండా ఉండడం, పరులకు చెందిన వాటిని దోచుకోవాలనే ఆలోచన చేయకపోవడం, ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం, వీలైనంత వరకూ... అర్హులయినవారికి దానం చేయడం, పర మహిళల అనవసరమైన మాటలు మాట్లాడకపోవడం, అర్హతను మించి ఆధికంగా ఆశించకపోవడం, గురువుల పట్ల వినయ విధేయతలతో మెలగడం, సర్వ ప్రాణుల పట్ల దయతో వ్యవహరించడం.. ఇవన్నీ మానవులకు శ్రేయోదాయకమైన గుణాలు.

Updated Date - 2023-12-08T03:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising