ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Actress Genelia : పిల్లలతో కలసి చూడలేకపోతున్నాం

ABN, First Publish Date - 2023-07-23T00:34:26+05:30

‘బొమ్మరిల్లు’ చిత్రంతో హాసినీగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు నటి జెనీలియా. ఇటు దక్షిణాదిన, అటు బాలీవుడ్‌లో సినిమాలు చేసి, తర్వాత రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడారు. పిల్లల పెంపకంతో కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇటీవలె ఓటీటీలో

‘బొమ్మరిల్లు’ చిత్రంతో హాసినీగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు నటి జెనీలియా. ఇటు దక్షిణాదిన, అటు బాలీవుడ్‌లో సినిమాలు చేసి, తర్వాత రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడారు. పిల్లల పెంపకంతో కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇటీవలె ఓటీటీలో విడుదలైన ‘ట్రయల్‌ పీరియడ్‌’ వెబ్‌సిరీస్‌ ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓటీటీ కంటెంట్‌పైన జెనీలియా చేసిన విమర్శలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో వస్తున్న వెబ్‌సిరీస్‌లను పిల్లలతో కలసి చూడలేకపోతున్నామని జెనీలియా అన్నారు. ఇంట్లో అంతా కలసి చూసేలా ఉన్న కంటెంట్‌ చాలా తక్కువ గా ఉంది, కుటుంబం అంతా కలసి చూసేలా మంచి కంటెంట్‌ రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ట్రయల్‌ పీరియడ్‌’ వెబ్‌సిరీస్‌ ఫ్యామిలీ అంతా కలసి చూస్తూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుందనీ, ఇందులో ఒంటరి మహిళగా కనిపిస్తానని జెనీలియా చెప్పారు. సినిమాల్లో ఆధునికంగా కనిపిస్తూనే ఎబ్బెట్టుగా అనిపించని దుస్తులను మాత్రమే ధరించేదాన్ని, అలాగే రొమాంటిక్‌ సీన్లలోనూ ఎక్కడా హద్దులు దాటకుండా నటించానని ఆమె చెప్పారు.

Updated Date - 2023-07-23T00:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising