ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anushka Jain: సేవా వారధి...

ABN, First Publish Date - 2023-05-17T00:25:35+05:30

‘‘ఇంజనీరింగ్‌ చదువు, బెంగళూర్‌లోని ఒక బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం. జీవితం సరదాగా, హాయిగా సాగిపోతున్న రోజులవి. అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులే చాలా చికాకు పెడుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులకు పరిష్కారం కనుక్కొనే దిశగా నేను చేసిన ఆలోచనే... ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ అనే ఒక వేదికను ఏర్పాటు చేయడానికి దారి తీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎవరికైనా ఇచ్చేద్దామనుకొనే వస్తువులుంటాయి... ఎవరికివ్వాలో తెలీదు.

అలాంటి వస్తువులు అవసరమైన వారుంటారు. ఎవరిస్తారో తెలీదు...

ఈ రెండు రకాల వ్యక్తులకూ మధ్య వారధిగా నిలుస్తున్నారు అనుష్కా జైన్‌.

పదకొండు మహా నగరాలతో సహా... దేశంలోని ఆరు వందల ప్రాంతాల్లో ఆమె సారథ్యంలోని ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ సేవలు అందిస్తోంది.

‘‘ఇంజనీరింగ్‌ చదువు, బెంగళూర్‌లోని ఒక బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం. జీవితం సరదాగా, హాయిగా సాగిపోతున్న రోజులవి. అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులే చాలా చికాకు పెడుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులకు పరిష్కారం కనుక్కొనే దిశగా నేను చేసిన ఆలోచనే... ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ అనే ఒక వేదికను ఏర్పాటు చేయడానికి దారి తీసింది.

నేను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పుట్టి పెరిగాను. మాది మధ్యతరగతి కుటుంబం. చదువు పూర్తై, ఉద్యోగంలో చేరాక... ఎనిమిదేళ్ళ క్రితం నాకొక చిన్న ఇబ్బంది ఎదురయింది. కొన్ని వస్తువులనూ, దుస్తులనూ నా గదిలోంచి తీసెయ్యాల్సి వచ్చింది. అవి ఎంతో నచ్చి కొనుక్కున్నవి. చాలా ఇష్టంగా వాటిని ఉపయోగించుకున్నాను. పూర్తిగా పాడవలేదు. వాటిని ఏ చెత్త కుప్ప మీదో పారెయ్యడానికి మనసొప్పలేదు. వేరే ఎవరికైనా అవి పనికొస్తాయి, కానీ ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. ఇది నేను చిన్నప్పటి నుంచీ గమనిస్తున్న సమస్యే. మా అమ్మ కేవలం తన పుట్టినరోజు నాడు మాత్రమే పాత దుస్తుల్ని ఎవరికైనా ఇచ్చేది. మా అమ్మ పనుల్తో చాలా బిజీ కాబట్టి... ఆ రోజు తీరిక చేసుకొని ఇలా చేస్తోందనుకొనేదాన్ని. ఒకసారి అమ్మను అడిగితే ‘‘వస్తువుల్ని వేరేవాళ్ళకి ఇవ్వడం అంత సులువేం కాదు’’ అంది నవ్వుతూ. ఇప్పుడది నా అనుభవలోకి వచ్చింది.

దీని గురించి నా స్నేహితులతో, సహోద్యోగులతో మాట్లాడుతున్నప్పుడు... నేనొక విషయం గమనించాను. వస్తువులు దానం చేసేవారికీ, వాటిని సేకరించి, అవసరమైనవారికి అందజేసే స్వచ్ఛంద సంస్థలకూ మధ్య పెద్ద గ్యాప్‌ ఉంది. ఈ సంస్థల మీద చాలామందికి నమ్మకం ఉండదు. లేదా వారిని ఎలా సంప్రతించాలో తెలీదు. లేదా ఆ సంస్థకు వెళ్ళి అందించడానికి సమయం ఉండదు. చివరకు వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలనుకున్న వస్తువులన్నీ వీధి చివర చెత్తకుండీలోకి చేరిపోతాయి. ఈ గ్యాప్‌ని భర్తీ చేయడానికీ, ఆ వస్తువులు ఎవరికి ఉపయోగపడతాయనేది తెలుసుకోడానికీ 2015లో ‘షేర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ (ఎస్‌ఎడిఎస్‌) అనే సర్వీస్‌ ప్రారంభించాను. మరీ పాడైపోకుండా ఉపయోగించిన వస్తువులను ఇంటి గుమ్మం దగ్గరే తీసుకొని, వాటిని ఎన్జీవోలకో, ఛారిటీ సంస్థలకో అందజేయడం దీని ఉద్దేశం.

అనుమానంగా చూస్తారు...

అయితే కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయి ఇలాంటి పని మొదలెట్టడం నా కుటుంబానికి ఇష్టం లేదు. ‘‘వాడేందుకు వీలుగా ఉన్న వస్తువుల్ని కొనుక్కోలేనివాళ్ళు ఎందరో ఉన్నారు. వాటిని మనం ఊరకే పారేస్తున్నాం. ఇది కూడా సంపదను వృధా చెయ్యడమే కదా!’’ అని వారికి నచ్చజెప్పాను. మొదట ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాను. తమ దగ్గరున్న వస్తువుల్ని ఏ సమయంలో తీసుకోవచ్చో దాతలు ఆ వెబ్‌సైట్‌లో సూచించవచ్చు. అప్పట్లో నా ఆలోచన అందరికీ చాలా కొత్తది. ఇచ్చేవారినీ, వాటిని తీసుకొని, అవసరమైన వారికి అందించేవారినీ ఒప్పించడం చాలా కష్టమైంది. ఎలాంటి నేపథ్యం లేకుండా, గుర్తింపు ఉన్న సంస్థల అండ లేకుండా ఇలాంటి సేవలను స్వచ్ఛందంగా చేయాలనుకొనేవారిని జనం అనుమానంగా చూస్తారని నాకు అర్థమయింది. కానీ నాతో కలిసి పని చెయ్యడానికి కొందరు ముందుకు వచ్చారు. కొద్దిమంది వాలంటీర్లతో, రెండు ఎన్జీవోల భాగస్వామ్యంతో... బెంగళూరులో ‘ఎస్‌ఎడిఎస్‌’ మొదలైంది. క్రమంగా ఆనోటా ఈనోటా మా గురించి తెలిసింది. విజ్ఞాపనలు వెల్లువెత్తాయి. ఒక్కో రోజు ఆఫీసుకి వెళ్ళడానికి ముందు, తరువాత... దాదాపు 150 మంది నుంచి వస్తువులు సేకరించిన రోజులు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నైతో సహా పదకొండు ప్రధాన నగరాల్లో పూర్తి స్థాయిలో మా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆరు వందల పైచిలుకు ఊళ్ళలో తేలికపాటి వస్తువుల్ని సేకరిస్తున్నాం. నూట ఇరవైకి పైగా ఎన్జీవోలు, వందకు పైగా కార్పొరేట్‌ సంస్థలు... ‘ఎస్‌ఎడిఎస్‌’కు భాగస్వాములుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అయిదు లక్షల మంది యూజర్లున్నారు. సుమారు పది లక్షలమందికి వివిధ రకాల వస్తువులను, విరాళాలను అందించాం. ప్రధానంగా పేద వర్గాలకు చెందిన, మానసికంగా ఎదుగుదల లేని పిల్లల అవసరాలు తీర్చడానికి కృషి చేస్తున్నాం. ఇప్పుడు నా సమయమంతా ‘ఎస్‌ఎడిఎస్‌’ కోసమే వినియోగిస్తున్నాను. ఈ క్రమంలో ‘డిజిటల్‌ ఉమెన్స్‌ అవార్డ్‌’, ‘ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అవార్డ్‌’లాంటి అనేక పురస్కారాలను అందుకున్నాను. అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌ స్టార్టప్స్‌ కోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, డి–ల్యాబ్స్‌ చేపట్టిన ‘ఎన్విజన్‌ యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌’కు ఎంపికైన పదిమందిలో నేనూ ఉండడం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. నేను చేస్తున్న పని నలుగురికి పనికొచ్చేలా, పర్యావరణహితంగా ఉంటుందనే సంతృప్తి... ‘ఎస్‌ఎడిఎస్‌’ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ప్రేరణను కలిగిస్తోంది.’’

Updated Date - 2023-05-17T00:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising