ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Billions of wins : రూ. వెయ్యికోట్ల విజయాలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 06:12 AM

ఒకప్పుడు సక్సెస్‌కు చిరునామాగా నిలిచిన బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ప్రభ కరోనా తర్వాత మసకబారింది. ఒక్క హిట్‌ కోసం ఎదరుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2022లో దాదాపు

ఒకప్పుడు సక్సెస్‌కు చిరునామాగా నిలిచిన బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ప్రభ కరోనా తర్వాత మసకబారింది. ఒక్క హిట్‌ కోసం ఎదరుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2022లో దాదాపు 100 చిత్రాలు విడుదలైతే అరడజను చిత్రాలు కూడా హిట్టవ్వలేదు. అగ్రహీరోల చిత్రాలు సైతం బాక్సాఫీసు దగ్గర వెలవెల పోయాయి. 2023లో మాత్రం పరిస్థితి కొంత మెరుగైంది. అగ్రహీరోలు నటించిన చిత్రాలు కొన్ని మంచి వసూళ్లను సాధించి పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

బాలీవుడ్‌ను దశాబ్దాలపాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఖాన్‌ త్రయం ఇప్పుడు మాత్రం విజయం కోసం సర్వశక్తులు ఓడ్డాల్సిన పరిస్థితిలో ఉంది. ‘జీరో’ చిత్రం ఇచ్చిన షాక్‌ నుంచి కోలుకోవడానికి కింగ్‌ఖాన్‌ షారూఖ్‌ఖాన్‌కు చాలా టైమ్‌ పట్టింది. ఈ ఏడాది ‘పఠాన్‌’ చిత్రంతో ఆయన అనూహ్య విజయాన్ని అందుకొన్నారు. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం రూ. వెయ్యి కోట్ల వసూళ్లను దక్కించుకొని చిత్రపరిశ్రమకు ఊపిరిలూదింది. అదే మ్యాజిక్‌ను ‘జవాన్‌’ చిత్రంతోనూ కొనసాగించారు షారూఖ్‌. మరోసారి వెయ్యికోట్ల్ల సినిమాను ఖాతాలో వేసుకొని తన స్టార్‌డమ్‌కు తిరుగులేదని చాటారు. ఇదే ఏడాది ఆయన నటించిన మూడో చిత్రం కూడా విడుదలవుతుండడం విశేషం. ‘డంకీ’ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ‘ఈ సినిమా కూడా వేయికోట్లు వసూళ్లను సాధిస్తుందా?’ అని సినీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

సల్మాన్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ విజయం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 2019లో వచ్చిన ‘దబాంగ్‌ 3’ తర్వాత సల్మాన్‌కు ఇప్పటివరకూ హిట్‌ లేదు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర వెలవెలబోయాయి. ‘రాధే, అంతిమ్‌, గాడ్‌ఫాదర్‌, కిసీకాభాయ్‌ కిసీకీ జాన్‌’ చిత్రాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లగా మిగిలాయి. ఈ ఏడాది చివరలో తనకు అచ్చొచ్చిన టైగర్‌ ఫ్రాంచైజీతో వచ్చాడు సల్లూబాయ్‌. ఈ సినిమాతో అయినా భారీహిట్‌ కొట్టి సల్మాన్‌ తన పూర్వ వైభవాన్ని పొందాలనుకున్నా ఆ కోరిక నెరవేరలేదు. ‘టైగర్‌ 3’ నవంబరులో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కట్రినా కైఫ్‌ అందాల ప్రదర్శన, యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ విలువలు ఏవీ కూడా సల్మాన్‌కు హిట్‌ ఇవ్వలేకపోయాయి. ఎంత ఫాలోయింగ్‌ ఉన్నా వరుస ప్లాప్స్‌తో కొనసాగడం సల్మాన్‌లాంటి హీరోకి ఇబ్బందికరమే.

ఈ ఏడాది రిలీజ్‌ లేని ఆమిర్‌

హిందీ చిత్రసీమలో ఆమిర్‌ఖాన్‌ సక్సె్‌సకు చిరునామాగా నిలిచారు. బాక్సాఫీసు రికార్డులకు కొదవలేదు. 2016లో వచ్చిన ‘దంగల్‌’ చిత్రంతో ఆమిర్‌పేరు మరోసారి ఊరూవాడ మార్మోగింది. మరుసటి ఏడాది ఆయన కీలకపాత్రలో నటిస్తూ, నిర్మించిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ చిత్రం కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఆ ఏడాది హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. కానీ ఆమిర్‌ ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయారు. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’, ‘లాల్‌సింగ్‌చద్దా’ చిత్రాలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీశాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లాల్‌సింగ్‌చద్దా’ చిత్రం షాక్‌ ఇచ్చింది. ‘వామ్మో ఆమిర్‌ఖాన్‌ సినిమానా?’ అని జనాలు భయపడే లా చేశారు. దాంతో వరుస పరాజయాలతో కొనసాగుతున్న తన సినీ ప్రయాణానికి ఆయన కొన్నాళ్లు బ్రేక్‌ ఇచ్చారు. మళ్లీ తన కొత్త చిత్రం ఇప్పుడప్పుడే సెట్స్‌పైకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద హీరోలు సినిమా పూర్తి చేయడానికి ఒకట్రెండు ఏళ్లు పడుతోంది. ఈ లెక్కన ఆమిర్‌ఖాన్‌ మరో సినిమాతో రావడానికి ఎన్నాళ్లు పడుతుందో!

ఓ మై గాడ్‌ 2తో హిట్‌ ట్రాక్‌

కరోనాకు ముందు వరుస విజయాలు అందుకున్న సీనియర్‌ హీరోల్లో అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌కుమార్‌ ఉన్నారు. చేతిలో ఎప్పుడూ అరడజను చిత్రాలతో బిజీగా ఉన్న ఈ హీరోలూ వరుస అపజయాలతో కుదేలయ్యారు. వరుస విజయాలతో ఖాన్‌త్రయానికి సవాల్‌ విసిరిన సీనియర్‌ హీరోల్లో అక్షయ్‌కుమార్‌ ముందుండేవారు. కరోనాకు ముందు అక్షయ్‌ కెరీర్‌ పట్టిందల్లా బంగారమే అన్నట్లు సాగింది. కరోనా ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో కూడా ఆయన విదేశాలకు వెళ్లి చిత్రీకరణల్లో పాల్గొని పరిశ్రమకు కొత్త జోష్‌ తెచ్చారు. అలాంటిది అక్షయ్‌ కొన్నాళ్లుగా హిట్లు లేక విలవిల్లాడుతున్నాడు. గతేడాది ఆయన నటించిన ఐదారు చిత్రాలు విడుదలయ్యాయి. హిట్‌ సంగతి అలా ఉంచితే కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయాయి. ‘బచ్చన్‌పాండే, సామ్రాట్‌ పృథ్విరాజ్‌, రక్షాబంధన్‌, కట్ట్‌పుత్‌ల్లీ’, రామ్‌సేతు’ మొత్తం టోకున ప్లాప్‌ల జాబితాలో చేరాయి. ఈ ఏడాది ఆరంభంలో మలయాళ రీమేక్‌ ‘సెల్ఫీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అభిమానులను ఎంటర్టైన్‌ చేయలేకపోయారు. ‘ఓమైగాడ్‌ 2’ చిత్రం అక్షయ్‌ను మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కించింది. ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

అజయ్‌ ఖాతాలో అపజయం

కరోనాకు ముందు మాంచి ఊపుమీదున్న మరో సీనియర్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌. ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన ‘తానాజీ’ చిత్రం 2020లో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. 2021లో ఆయన అతిథి పాత్రలో నటించిన ‘సూర్యవంశీ’ ఒక్కటే ఆయనకు థియేట్రికల్‌ రిలీజ్‌. ‘భుజ్‌’ చిత్రం ఓటీటీలో విడుదలైనా అంతగా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. గతేడాది ‘రన్‌వే 34’, ‘థాంక్‌ గాడ్‌’ చిత్రాలు రెండూ నిరాశపరిచాయి. ఈ వరుస వైఫల్యాల నుంచి అజయ్‌దేవగణ్‌కు ‘దృశ్యం 2’ రూపంలో ఊరట దొరికింది. లో బడ్జెట్‌లో తెరకెక్కి రూ. 300 కోట్ల దాకా వసూళ్లను రాబట్టి సంచలన విజయంగా నిలిచింది. అయితే అజయ్‌ ఆ తర్వాతా అదే ఊపును కొనసాగించలేకపోయారు. ఈ ఏడాది వచ్చిన ‘భోళా’ చిత్రం హిందీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. తమిళ హీరో కార్తి నటించిన ‘ఖైదీ’ చిత్రానికి ఇది రీమేక్‌. అజయ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

యానిమల్‌ ఫీవర్‌...

సీనియర్‌ హీరోలకే కాదు యువ హీరోల పరిస్థితి కూడా ఇలానే ఉంది. రణ్‌బీర్‌కపూర్‌ గత వైఫల్యాలను మరిపించే ఒక్క హిట్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఈ ఏడాది చివర్లో ఫలించాయ. ‘షంషేరా’, ‘బ్రహ్మాస్త్ర’ ‘తూ ఝూటీ మై మక్కార్‌’ చిత్రాల ఫలితాలతో రణ్‌బీర్‌కు తలబొప్పి కట్టింది. ఈ ఏడాది ఆయనకు అదృష్టం ‘యానిమల్‌’ చిత్రం రూపంలోవచ్చింది. వరుస పరాజయాల నుంచి రణ్‌బీర్‌ను హిట్‌ ట్రాక్‌ ఎక్కించింది. ఇప్పటికి రూ. వెయ్యి కోట్ల వసూళ్లకు దగ్గరలో ఉందీ చిత్రం. మరో యువ హీరో రణ్‌వీర్‌సింగ్‌ నటించిన ‘83’, ‘జయే్‌షబాయ్‌ జోర్దార్‌’, ‘సర్కస్‌’ చిత్రాలు వరుసగా అపజయం పాలయ్యాయి. ఇప్పుడు ఆయనకు హిట్‌ చాలా ముఖ్యం. అలియాభట్‌ కథానాయికగా నటించిన ‘రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ చిత్రం కూడా రణ్‌వీర్‌ను గట్టెక్కించలేదు. గతేడాది విడుదలైన ‘విక్రమ్‌ వేదా’ చిత్రం హృతిక్‌రోషన్‌ విజయ పరంపరకు బ్రేక్‌ వేసింది. ఈ ఏడాది హృతిక్‌ నుంచి ఒక్క రిలీజ్‌ కూడా లేదు. ‘టైగర్‌ 3’లో అతిథి పాత్రలో కనిపించారు. వచ్చే ఏడాది ఆయన నటించిన ‘ఫైటర్‌’ చిత్రం విడుదలవుతోంది. కార్తిక్‌ ఆర్యన్‌ ‘షెహజాదా’, ‘సత్యప్రేమ్‌ కీ కథ’ చిత్రాలు రెండూ ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఇక టైగర్‌ ష్రాఫ్‌ ‘భాగీ 3’తో భారీ హిట్‌ కొట్టినా ఈ ఏడాది ‘గణ్‌పత్‌’ చిత్రం నిరాశపరిచింది. రూ. 200 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీసు దగ్గర కేవలం రూ. 15 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా మిగిలింది.

Updated Date - Dec 17 , 2023 | 06:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising