Fan: ఫ్యాన్ రెక్కలు ఎందుకు అలా ఉంటాయ్..? ఇప్పటికీ చాలా మందికి తెలియని అసలు నిజమిదీ..!
ABN, First Publish Date - 2023-08-02T16:13:58+05:30
సీలింగ్ ఫ్యాన్‌ల బ్లేడ్‌లు మెలితిప్పినట్లు ఉంచడానికి ఇదే కారణం. ఫ్యాన్‌తో ఫోన్ చేయడం అనే విధానం చాలామందికి తెలియదు.
ఇంటి వాతావరణంలో గాలి సరిగా లేకపోతే ఉక్కపోతగా ఉంటుంది. అలాగే గాలి కోసం అందరూ వాడే సాధనం ఫ్యాన్ మాత్రమే. అయితే ఫ్యాన్ లేకపోతే వేసవిని గడపడం కష్టం. మూడు రెక్కలతో చిన్న గదిలో కూడా చల్లని వాతావరణాన్ని ఇవ్వగలదు. సీలింగ్ ఫ్యాన్ అనేది ప్రతి ఇంట్లో పెద్ద ఖర్చు లేకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇప్పటి రోజులకు తగ్గట్టుగా ఈ ఫ్యాన్ల డిజైన్స్, ఫీచర్స్ వచ్చేసాయి. వీటిలో అవి చాలా శక్తివంతమైన డిజైన్ ఫీచర్‌ను కలిగి ఉంటున్నాయి, ఈ ఫ్యాన్స్‌తో ఇళ్ళల్లో ఉండే వాళ్ళకు ఇవి చాలా ఉపయోగపడతాయి,. ఈ ఫ్యాన్స్ సహయంతో ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా వీటిలో చాలా అప్షన్స్ ఉన్నాయి.
ఫ్యాన్ బ్లేడ్ డిజైన్
సీలింగ్ ఫ్యాన్‌ని చూసినట్లయితే, దాని బ్లేడ్‌ను గమనించాలి. దూరం నుండి, ఇది పూర్తిగా చదునైనట్లు కనిపిస్తుంది, అయితే వాస్తవం వేరేది. వాస్తవానికి సీలింగ్ ఫ్యాన్, బ్లేడ్ ఒక నిర్దిష్ట కోణంలో కనిపిస్తుంది. అయితే ఇదేం తయారీ లోపం కాదు. కిందనించి చూసి ఇదేదో తయారీ లోపం అనుకుంటారు కానీ ఈ డిజైన్ వల్ల వేసవి కాలంలో సీలింగ్ ఫ్యాన్ గాలిని బలంగా వీచి గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. ఇది తయారు చేసిన కంపెనీ ఆలోచన.
ఇది కూడా చదవండి: పెళ్లిలో ఏడు సార్లే ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు..? 5 సార్లో, 9 సార్లో ఎందుకు చేయరు..?
ట్విస్ట్ ఫ్యాన్ బ్లేడ్ ఎందుకు అవసరం?
సీలింగ్ ఫ్యాన్‌లకు ట్విస్ట్ ఫ్యాన్ బ్లేడ్ చాలా ముఖ్యం. కంపెనీలు ఉద్దేశపూర్వకంగా దీన్ని తయారు చేసాయి. ఫ్యాన్ బ్లేడ్ గాలిని క్రిందికి నెట్టగలది. దాన్ని ఫ్లాట్‌గా ఉంచితే కింద కూర్చున్న వారికి గాలి తగలదు. అలాగే తిరుగుతూనే ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్‌ల బ్లేడ్‌లు మెలితిప్పినట్లు ఉంచడానికి ఇదే కారణం. ఫ్యాన్‌తో ఫోన్ చేయడం అనే విధానం చాలామందికి తెలియదు. భవిష్యత్‌లో మనం ఉపయోగించే చాలా రకాల ఫ్యాన్స్ ఇలానే అప్డేటెడ్‌గా ఉంటాయి.
Updated Date - 2023-08-02T16:13:58+05:30 IST