సమ్మర్ గౌన్స్‌లో హాయిగా...
ABN, First Publish Date - 2023-04-19T00:10:59+05:30
సమ్మర్‌లో ఆహ్లాదంగా, సౌకర్యంగా ఉండే దుస్తులకే పెద్ద పీట వేస్తూ ఉంటాం.
సమ్మర్‌లో ఆహ్లాదంగా, సౌకర్యంగా ఉండే దుస్తులకే పెద్ద పీట వేస్తూ ఉంటాం. వాటిలో చెప్పుకోదగినవే ‘సమ్మర్ గౌన్స్’. ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో మహిళల మనసుసులను దోచుకుంటున్న సమ్మర్ గౌన్స్ ఇవే!
వేర్వేరు మెటీరియల్స్‌లో: కాటన్, షిఫాన్, రేయాన్ మొదలైన మెటీరియల్స్‌తో తయారయ్యే సమ్మర్ గౌన్స్‌లో నప్పే వాటిని ఎంచుకోవాలి. మెటీరియల్‌కూ, సౌకర్యానికీ, సందర్భానికీ సమ ప్రాధాన్యమివ్వాలి. ఈవినింగ్ వేర్‌గా సింథటిక్, షిఫాన్, రేయాన్ మెటీరియల్స్‌తో తయారైన గౌన్స్ ధరిస్తూ, పగటి వేళ కాటన్ గౌన్స్‌కే ప్రాధాన్యమివ్వాలి.
అంకరణ ఇలా: వేసవి మేకప్ ఎంత తక్కువగా ఉంటే అంత ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి లేత రంగు లిప్‌స్టిక్, షాడోలను ఎంచుకోవాలి. గౌన్స్ ధరించేటప్పుడు, హెయిర్ వదిలేసుకోవచ్చు. లేదా పోనీ టెయిల్ వేసుకోవచ్చు.
యాక్సెసరీస్: సింపుల్ యాంటిక్ లేదా బీడ్ జ్యువెలరీ ఈ డ్రస్‌కు సూటవుతుంది. టెర్రకోటా జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణను తెచ్చి పెడుతుంది. అలాగే పెన్సిల్ హీల్స్ ధరించవచ్చు. వీటితో స్టైలిష్‌గా కనిపించవచ్చు. ఫ్లాట్స్ కూడా సూటవుతాయి. అయితే అవి ఫంకీగా ఉండేలా చూసుకోవాలి. నడుముకు బెల్ట్ ధరిస్తే, మరింత ట్రెండీగా కనిపిస్తారు.
Updated Date - 2023-04-19T00:15:10+05:30 IST