ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వెర్రితనం!

ABN, First Publish Date - 2023-08-07T23:37:15+05:30

ఒక ఊరిలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికే తెలివి ఎక్కువ ఉందని అనుకునేవాడు. పైగా తన తెలివి వల్లనే అంతా సాఫీగా జరుగుతోందని అనుకునేవాడు.

ఒక ఊరిలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికే తెలివి ఎక్కువ ఉందని అనుకునేవాడు. పైగా తన తెలివి వల్లనే అంతా సాఫీగా జరుగుతోందని అనుకునేవాడు. అతడో రైతు. వ్యవసాయం చేస్తూ కాలం గడిపేవాడు. తనకో రెండు ఎద్దులు ఉండేవి. సేద్యం చేశాక.. చేను పని అయిపోయాక.. తన ఎద్దులను వేపచెట్టు కింద బండికి కట్టేసేవాడు. ఆ తర్వాత తనూ నిద్రపోయేవాడు. ఇలా ఆ వేపచెట్టుతో అతని అనుబంధం పెరిగిపోయింది.

ఒక రోజు మధ్యాహ్నం పూట ఒక మిత్రుడు ఇంటి దగ్గరకు వెళ్లాడు. అక్కడ బర్రెలు కట్టేసి ఉన్నాయి. వేపచెట్టు కింద ఓ అరుగు ఉన్నది. తువాలు దిండుగా చేసుకుని పడుకున్నాడు. వేపకాయల వైపు చూశాడు. ఆ తర్వాత ఓ గుమ్మడి తీగను చూశాడు. ఈ వేపచెట్టుతో పాటు నా చేలో ఉండే వేపచెట్టును ఇరవై ఏళ్లుగా చూస్తున్నా అనుకున్నాడు. ఇంత వేపచెట్టుకు అంత చిన్న వేపకాయలు, తీగ చెట్టుకు అంత పెద్ద గుమ్మడికాయలున్నాయి. ఇది బాగలేదు అనుకున్నాడు. పైగా దేవుడుకి మతి భ్రమించింది అనుకున్నాడు. నేనే దేవుడిని అయితే ఎంత చెట్టుకు అంత పెద్ద కాయలు కాయించేవాన్నంటు తెలివిగా అనుకున్నాడు. అనుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు. రెండు వేపకాయలు తనమీద పడ్డాయి. ఏదో కల వచ్చినట్లు, ఎవరో కొట్టినట్లు అదిరిపోయాడు. భయపడ్డాడు. క్షణాల్లో తన తప్పు తెలిసింది. అదే వేపచెట్టుకు గుమ్మడికాయంత వేపకాయలు కాసి ఉంటే చచ్చి ఊరుకుండేవాన్ని అనుకున్నాడు.

ఎప్పుడూ తనే అద్భుతమైన తెలివి అనుకునే మల్లయ్య తీరు మారింది. ఈ ప్రకృతి గొప్పది. నిజంగా దేవుడు ఉన్నాడంటే అతను గొప్పవాడు అనుకున్నాడు. నావన్నీ వెర్రి ఆలోచనలే అనుకుంటూ తన గురించి తాను తెలుసుకున్నాడు.

Updated Date - 2023-08-07T23:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising