Google Chrome Extensions: ప్రమాదకరంగా గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్
ABN, First Publish Date - 2023-06-10T00:46:50+05:30
వెబ్ బ్రౌజర్ ఫంక్షనాలిటీ మెరుగుకోసం ఉద్దేశించిన గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ ప్రమాదకరంగా మారాయి. వెబ్ సెర్చ్‌లను దొంగలించి, పేజీల్లోకి యాడ్స్‌ను ఇవి జొప్పిస్తున్నాయి.
వెబ్ బ్రౌజర్ ఫంక్షనాలిటీ మెరుగుకోసం ఉద్దేశించిన గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ ప్రమాదకరంగా మారాయి. వెబ్ సెర్చ్‌లను దొంగలించి, పేజీల్లోకి యాడ్స్‌ను ఇవి జొప్పిస్తున్నాయి. క్రోబ్ వెబ్‌స్టోర్‌లో హానికరమైన బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయని సాఫ్ట్‌వేర్ ఫర్మ్ ‘అవస్ట్’ తెలిపింది. యాడ్‌వేర్‌ని పంపిణి చేసి ఇవి సెర్చ్ ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. పీడీఎఫ్ టూల్‌బాక్స్ ఎక్స్‌టెన్షన్‌లో మొదట దీన్ని ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ విశ్లేషించారు. 32 మాలాసియస్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్, ఏడున్నర కోట్ల మేర డౌన్‌లోడ్స్ జరిగినట్టు తేల్చారు. ఈ ఎక్స్‌టెన్షన్స్ - బ్లాకర్స్ నుంచి డౌన్‌లోడర్స్, బ్రౌజర్ థీమ్స్ - రికార్డర్స్, టాబ్ మేనేజర్స్ వరకు ఉన్నాయి. 50 వరకు అదనంగా ఉన్న ఇటువంటి ఎక్స్‌టెన్షన్స్‌ను ఇప్పటికే తొలగించారు. మొత్తానికి అన్నింటినీ గూగుల్ తీసేసింది. అయితే మున్ముందు కూడా ఇలాంటి ముప్పు నుంచి బైటపడాలంటే, ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వాటిని యూజర్లు తొలగించుకోవాలి. ఎక్స్‌టెన్షన్స్‌ను క్రోమ్ వెబ్‌స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. మరేదైనా అయితే డెవలపర్ రెప్యుటేషన్, రెవ్యూని చెక్ చేసుకోవాలి. అనవసరంగా అనుమతులను కోరే వాటి విషయమై కన్నేసి ఉంచాలి. యాంటీ వైరస్ స్కానర్ సిస్టమ్‌లో రన్ అయ్యేలా చూసుకోవాలి.
Updated Date - 2023-06-10T00:46:50+05:30 IST