ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hong Kong : మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-01-16T23:10:27+05:30

దక్షిణ చైనాలో ఉండే నగరమిది. ప్రపంచంలోనే పాపులర్‌ సిటీ ‘హాంకాంగ్‌’. యాత్రికులకు స్వర్గధామం. షాపింగ్‌కు ఫేమస్‌. టూరిస్టుల కోసమే తయారు చేసిన నగరమిది. ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడతారు. చైనా ప్రత్యేక పాలనా ప్రదేశమిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దక్షిణ చైనాలో ఉండే నగరమిది. ప్రపంచంలోనే పాపులర్‌ సిటీ ‘హాంకాంగ్‌’. యాత్రికులకు స్వర్గధామం. షాపింగ్‌కు ఫేమస్‌. టూరిస్టుల కోసమే తయారు చేసిన నగరమిది. ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడతారు. చైనా ప్రత్యేక పాలనా ప్రదేశమిది.

  • హాంకాంగ్‌ అంటే చీనీ భాషలో ‘ఫ్రాగ్రంట్‌ హార్బర్‌’ అని అర్థం. ఓడరేవులతో పాటు అందమైన, ఎత్తైన కట్టడాలకు ప్రసిద్ధి ఈ నగరం. వాస్తవానికి ఇది 263 దీవుల సముదాయమిది. ఇక్కడి శుభ్రమైన పరిసరాలు, అందమైన బీచ్‌లు ఆహ్లాదకరం. ఆసియాలోని ఖరీదైన నగరాల్లో ఇదే ప్రథమం. సింగపూర్‌ను మించి యాత్రికుల సందడి హాంకాంగ్‌కు ఉంటుంది.

  • ప్రపంచంలోనే అతి పొడవైన ఎస్కలేటర్‌ ఇక్కడ ఉంది. మిడ్‌ లెవల్‌ ఎస్కలేటర్స్‌ కనీసం అరకిలోమీటర్‌ ఉంటాయి.

  • డబ్బును అధికంగా సంపాదించాలనే కోరిక ఉండే వాళ్లలో హాంకాంగ్‌ ప్రజలు ఒకరు. 2020 గ్లోబల్‌ బిలియనీర్‌ లిస్ట్‌ చూస్తే అందులో హాంకాంగ్‌ ర్యాంక్‌ 7 వ స్థానం.

  • 7.5 మిలియన్లు జనాభా ఉండే ఈ నగరంలో 95 శాతం చైనీయులే ఉంటారు. ఇక్కడి ప్రజలు ఎగ్‌టార్ట్‌, పైనాపిల్‌ బన్స్‌ ఇష్టంగా తింటారు. 20 సాకర్‌ గ్రౌండ్స్‌ అంత హాంకాంగ్‌లో విమానశ్రయం ఉంది.

  • చైనా, ఇంగ్లీష్‌ అధికారిక భాషలు. ఈ దేశాన్ని ‘వన్‌ కంట్రీ.. టూ సిస్టమ్స్‌’ అని పిలుస్తారు.

  • హాంకాంగ్‌ ప్రాంతాన్ని గతంలో జపాన్‌తో పాటు పోర్చుగీసు, బ్రిటన్‌ కూడా పాలించింది. ఇపుడు చైనా అదుపాజ్ఞలో ఉంది. విచిత్రమేంటంటే.. ఇక్కడి పాత బ్రిటీష్‌ కాలనీల్లో ఉండే వాళ్లు దాదాపు ఇంటికొకరు రోల్స్‌ రాయ్స్‌ కారును వాడతారు. అలా ప్రపంచంలోనే అత్యధిక రోల్స్‌ రాయ్స్‌ కార్లు ఇక్కడే ఉన్నవి.

  • ప్రపంచంలోనే అత్యధిక (సుమారు 9000) స్కై స్ర్కాపర్స్‌ ఇక్కడే ఉన్నాయి.

  • 40 శాతం పార్కులు, నేషనల్‌ రిజర్వ్స్‌ ఇక్కడ ఉన్నాయి. చైనాలో ఫోర్‌ అనే శబ్ధానికి అర్థం ‘డెత్‌’. అందుకే నాలుగో ఫ్లోర్‌ ఉండదు. లిఫ్ట్‌లో నాలుగు అంకె కనిపించదు.

Updated Date - 2023-01-16T23:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising