ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గాడిద నీడ

ABN, First Publish Date - 2023-08-30T23:33:16+05:30

అరేబియా రాజ్యంలో ఒక పేదవాడు ఉండేవాడు. పేరు ఇబ్రహీం. అతడికి ముగ్గురు పిల్లలు ఉండేవారు. ఇబ్రహీం చురుకైనవాడు. తెలివైనవాడు. సమయస్ఫూర్తితో మాట్లాడేవాడు...

అరేబియా రాజ్యంలో ఒక పేదవాడు ఉండేవాడు. పేరు ఇబ్రహీం. అతడికి ముగ్గురు పిల్లలు ఉండేవారు. ఇబ్రహీం చురుకైనవాడు. తెలివైనవాడు. సమయస్ఫూర్తితో మాట్లాడేవాడు. తనకు ఏ పని చేయాలో తోచక గాడిదను అద్దెకు ఇస్తూ జీవనం సాగించేవారు. గాడిద చాకిరీ చేయకుండా గాడిదను అద్దెకు ఇచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒక రోజు దూరం ప్రాంతం నుంచి ఓ వ్యాపారి వచ్చాడు. అతడు మహా కోపిష్టి. వచ్చీరాగానే ‘బరువు ఉంది. మోయాలి. నీవు వెనకాలే వస్తావు కదా!’ అంటూ గట్టిగా అరిచినట్లు మాట్లాడాడు. ఇబ్రహీం రోజువారి పని కాబట్టి.. సరే మహాప్రభో అన్నాడు. గాడిద మీద కూర్చున్నాడు వ్యాపారి. తన మూటలనూ గాడిదకు కట్టారు.

అది అసలే ఎడారి ప్రాంతం. మిట్టమధ్యాహ్నం ఎండ. చెట్లు లేవు. దీంతో వ్యాపారి విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. గాడిద మీద నుంచి దిగాడు. గాడిద నీడ కనపడింది. వెంటనే ఆ నీడలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. చూస్తుండగానే నిద్రలోకి జారుకున్నాడు. ఇబ్రహీంకు ఎండ వేడి తగులుతోంది, దీంతో గాడిదను కొంచెం దూరం తీసుకెళ్లాడు ఇబ్రహీం. గాడిద నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతలోనే తన మీద సూర్యకిరణాలు పడటంతో ఉలిక్కిపడి లేచాడు వ్యాపారి. కోపంతో ఇబ్రహీం దగ్గరకు వెళ్లాడు. ‘గాడిద మీద జీవించే పనోడా: నీకెంత కండకావరం. అసలు నా మీద ఎండ ఎలా పడుతుంది?’ అంటూ కోప్పడ్డాడు. నాఇష్టం అన్నాడు వెటకారంగా ఇబ్రహీం. ‘అదేంటీ. నీ పొగరేంటీ. గాడిదను నేను కొన్నాను. నాకే నీడ కావాలి కదా!’ అన్నాడు వ్యాపారి. ‘నేను గాడిదను అద్దెకు ఇచ్చాగానీ.. నీడను కాదు’ అన్నాడు ఇబ్రహీం. దీంతో కోప్పడిన వ్యాపారి ఎదురుగా ఉండే ఇబ్రహీం మీదకు వెళ్లాడు. మాటామాటా పెరగటంతో ఇద్దరు కొట్లాడుకున్నారు. ముష్టి యుద్ధానికి దిగారు. ఈ లోపు దారింటా వెళ్లే జనాలు వచ్చి వారిని కాస్త చల్లబరిచారు. ఇక దూరం పోవాలి కదా! అన్నాడు వ్యాపారి. పక్కకు చూస్తే వెనకాల గాడిద కనపడలేదు. దీంతో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లిపోయారు.

Updated Date - 2023-08-30T23:33:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising