ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ethnic wear : అదరగొట్టే ఎథ్నిక్‌ వేర్‌

ABN, First Publish Date - 2023-11-28T23:54:44+05:30

సందర్భానికి తగిన దుస్తులను ఎంచుకోవడం కూడా ఒక కళే! వేడుకలకు నప్పే దుస్తులను ఎంచుకోవడంలో మెలకువలను పాటిస్తే, నలుగురి దృష్టినీ

సందర్భానికి తగిన దుస్తులను ఎంచుకోవడం కూడా ఒక కళే! వేడుకలకు నప్పే దుస్తులను ఎంచుకోవడంలో మెలకువలను పాటిస్తే, నలుగురి దృష్టినీ ఆకర్షించవచ్చు. అందుకోసం సందర్భానికి తగిన దుస్తులను ఇలా ఎంచుకోండి.

బ్రైడల్‌ వేర్‌

పెళ్లి వేడుకల్లో మెరిసిపోవాలంటే, భారీ పనితనం కలిగి ఉండే బ్రైడల్‌ లెహెంగా ధరించాలి. సెక్విన్లు, ఎంబ్రాయిడరీ, జరీ బార్డరు కలిగి ఉండే లెహెంగాలు ఈ వేడుకలకు నప్పుతాయి. అలాగే జరీ చీరలు, కాంజీవరం పట్టు చీరలు కూడా పెళ్లి వేడుకల్లో అతిథులను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అయితే తేలికపాటి రంగులకు బదులుగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లాంటి ముదురు రంగు పట్టు చీరలను ఎంచుకోవాలి.

ఈవినింగ్‌ పార్టీ వేర్‌

ఈ వేడుకల్లో గౌన్లు, ఫ్లోర్‌ లెంగ్త్‌ అనార్కలి డ్రస్సులు బాగుంటాయి. ఆకట్టుకునే రంగులతో కూడిన పొడవాటి డిజైనర్‌ గౌన్లు, వాటికి తగిన యాక్సెసరీస్‌ ధరిస్తే ఈవినింగ్‌ పార్టీలో మెరుపుతీగలా మెరిసిపోవచ్చు. ఇక నేల మీద జీరాడే ఫ్లోర్‌ లెంగ్త్‌ అనార్కలి డ్రస్సులో మహరాణిలా వెలిగిపోవచ్చు. ఇవి సంప్రదాయ పెళ్లి ఫంక్షన్లకు బాగుంటాయి.

పార్టీ వేర్‌

ప్రత్యేకమైన సందర్భాల్లో, పార్టీల్లో ధరించడానికి అనార్కలి, ప్యాంట్‌ స్టైల్‌ సల్వార్‌ సూట్లు బాగుంటాయి. అనార్కలి డ్రస్‌తో గ్లామరస్‌ లుక్‌ సొంతమైతే, సల్వార్‌ సూట్‌తో సిగ్నేచర్‌ లుక్‌ సొంతమవుతుంది. పార్టీలు, ఈవెంట్లకు ఈ రెండు రకాల డ్రస్సులు చాలా బాగా సూటవుతాయి.

Updated Date - 2023-11-28T23:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising