ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Reading Books: పిల్లలు చదివేలా ఏ పుస్తకాలు ఎంచుకోవాలి.. మీకు క్లారిటీ ఉందా..?

ABN, First Publish Date - 2023-03-16T11:23:22+05:30

రోజంతా ఏదో హఢావుడిగా గడిపేస్తూ చదువులో మునిగిపోతున్నారు ఇప్పటి పిల్లలు.

Kids books
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఒకప్పుడు పిల్లలకు కథలు చెపుతుంటే 'ఊ' కొడుతూ పడుకునేవారు. ఇప్పడు కథలు చెప్పే నాయనమ్మలు లేరిప్పుడు, విని 'ఊ' కొట్టే పిల్లలకూ తిరికలేదు. రోజంతా ఏదో హఢావుడిగా గడిపేస్తూ చదువులో మునిగిపోతున్నారు ఇప్పటి పిల్లలు. అయితే ఒకటి మాత్రం ఎన్ని మార్పులు వచ్చినా పిల్లల్లో మారకుండా ఉంది. అదే కథల మీద ఆశక్తి. ఆ ఆశక్తితోనే కథలు చదివించుకుని ఆనందపడుతున్నారు ఇప్పటి పిల్లలు.

ఒకరు మరొకరిలా ఎప్పటికీ ఉండరు. ప్రతి పిల్లలూ మరోకరితో భిన్నంగానే ఉంటారు.

పుస్తకాలు చదవడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకునేలా మెదడును పెంచుతుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచి, జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో చదువును అలవర్చాలి. పిల్లలకు ఏది అలవాటు కావాలన్నా కూడా ముందు పెద్దలకు అలవాటు కావాలి. పిల్లలు ఏదైనా పెద్దలనుంచే నేర్చుకుంటారు. మరిచిపోకండి.

వయస్సుకి తగిన పుస్తకాలతో చదవడం ప్రారంభించండి: పిల్లల వయస్సు, పఠన స్థాయికి తగిన పుస్తకాలను ఎంచుకోవాలి. మొదటగా చిన్న పిల్లల కోసం చిత్ర పుస్తకాలతో ప్రారంభించవచ్చు. వాళ్ళ ఆసక్తికి తగిన విధంగా పుస్తకాలను కొని ఇవ్వడం వల్ల రోజు రోజుకీ వాళ్ళల్లో చదవాలనే ఆసక్తి కలుగుతుంది. ఒక విధంగా రెట్టింపు అవుతుంది.

ఇది కూడా చదవండి: ఈ వేసవిలో కుక్కలకు హీట్ స్ట్రోక్ తగలకూడదంటే.. ఇలా చేయండి..!

చదవడం అనేది రొటీన్‌గా చేసుకోవాలి: నిద్రవేళకు ముందు లేదా రాత్రి భోజనం తర్వాత పుస్తకాలను చదవడం కోసం కొద్దిగా సమయాన్ని ఉంచుకోవాలి. ఇలా అలవాటు చేయడం వల్ల ఆసక్తిగా రోజూ అదే సమయానికి పుస్తకం ముందు కూచుంటారు పిల్లలు.

ఆసక్తి కలిగించే విషయాలపై పుస్తకాలను ఎంచుకోవాలి: పిల్లలు ఆసక్తిని కలిగించే అంశం ఏదై ఉంటుందో అవే పుస్తకాలను చదవడానికి ఎంచుకుంటే త్వరగా చదవడానికి ఆసక్తిని చూపుతారు. పిల్లలు డైనోసార్‌లను ఇష్టపడితే, ఉదాహరణకు, వాటి గురించిన పుస్తకాలను కనుగొనండి. వారు క్రీడలను ఇష్టపడితే, వారికి ఇష్టమైన క్రీడ లేదా అథ్లెట్ గురించి పుస్తకాలను కనుగొనండి.

కలిసి చదవండి: ఒక వేళ అంతా కలిసి చదివే వీలున్న రోజుల్లో కుటుంబంతో కలిసి చదవడానికి సమయాన్ని వెచ్చించండి. కథను బిగ్గరగా చదవడం, చర్చించడం వంటివి పిల్లలు ఇష్టపడే విషయాలు. ఇవి పుస్తకాలను చదివే ఆసక్తిని, నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా పెద్దలకు, పిల్లలకు మధ్య స్నేహ బంధాన్ని ఏర్పరుస్తుంది.

రివార్డ్ చేయండి: స్క్రీన్ సమయం తగ్గించుకుని పుస్తకాలను చదివేందుకు ఆసక్తి చూపుతున్న మీ పిల్లలకు రివార్డ్‌లను ఆఫర్ చేయండి. ఇది వారికి చదవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వాళ్లకు నచ్చే పుస్తకాలే కాదు, పెన్నులు, చిన్న చిన్న డైరీలను కూడా తెచ్చి ఇవ్వడం వల్ల పిల్లలకు చదివిన పుస్తకాల గురించి పుస్తకంలో లేదా డైరీలో రాసుకునే అలవాటు దానంతట అదే అలవడుతుంది. మరెందుకు ఆలస్యం ఇలా చేసి పిల్లలకు పుస్తకాల అలవాటు చేయండి.

Updated Date - 2023-03-16T11:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising