ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Divorce Reasons: విడాకుల కేసుల్లో షాకింగ్ నిజాలు.. భార్యాభర్తలు విడిపోవడానికి 5 ముఖ్య కారణాలు ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-09-08T15:40:40+05:30

వైవాహిక జీవితంలో ఎదురయ్యే చాలా కష్టాలకు భార్యాభర్తలమధ్య సరైన అవగాహన లేకపోవడమే కారణం.

husband and wife

ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు. వివాహ బంధంలో ఇబ్బందులు పడుతూ జీవించాల్సిన అవసరం లేదంటున్నాయి చట్టాలు కూడా. దానికి తగినట్టుగానే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛకు భంగం కలిందనగానే, స్వేచ్ఛగా జీవించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమాజం ఏం అనుకుంటుందో, నలుగురూ ఏం అనుకుంటారో అనే ఆలోచన లేకుండా జీవితం కోసం ముందడుగు వేస్తున్నారు. ఈ కారణాలతో విడాకుల కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో చాలా కాలంగా సమాజంలో చులకనగా ఉన్న విడాకులు అనే పదం నేడు సర్వసాధారణమైపోయింది. జాగ్రత్తగా చూసినట్లయితే, ఇలా జరగడం వెనుక కారణం ఏ విధంగానూ కొత్తది కాదు.

కొన్నేళ్ల క్రితం వరకూ, ప్రేమ లేకుండా బలవంతంగా ఒకరితో ఒకరు జీవించారు. తక్కువ చదువుల కారణంగా మహిళలు ముఖ్యంగా ఈ పరిస్థితికి గురవుతూ వచ్చారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. చదువు ఇప్పుడు లింగభేధం లేకుండా అందరికీ సమానంగా అందుతుంది.. దీనితో ఇప్పటి పరిస్థితులు మారుతున్నాయి, ఇప్పుడు మగ, ఆడ అనే తేడా లేకుండా సంతోషంగా లేని వివాహంలో జీవించడానికి ఇష్టపడటం లేదు. కానీ విడాకులు ఏ జంటలమధ్య ఎక్కవగా జరుగుతున్నాయంటే.. అవేమిటంటే..

భార్యాభర్తల మధ్య ప్రేమ కోల్పోవడం..

సాధారణంగా, భార్యాభర్తల బంధంతో వచ్చే బాధ్యతల కారణంగా, ఒకరికొకరు సమయం ఇవ్వలేరు, ఇది తరువాత ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచుతుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో కూడా పెళ్లి తర్వాత ప్రేమ ముగుస్తుంది. ఇది కాకుండా, భాగస్వామిని తేలికగా తీసుకోవడం వంటివి పరస్పర ప్రేమ, గౌరవం కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా మారతాయి.

అవసరాలలో తేడా

విజయవంతమైన వివాహానికి దాంపత్యం కీలకం. భాగస్వామిని లైంగికంగా సంతృప్తిపరచలేకపోవడం, వివాహేతర సంబంధాలు, విడాకుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అందువల్ల, వివాహానికి ముందు ప్రాధాన్యతలను, పరిమితులను ఒకరితో ఒకరు చర్చించుకోవడం చాలా ముఖ్యం.

మరొకరితో సంబంధం

శారీరక, మానసిక అవసరాలను తీర్చుకోవడానికి వారి జీవిత భాగస్వామికి తెలియకుండానే ఇతర వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు. ఈ విషయం కారణంగా చాలా వివాహాలు పాడవడమే కాకుండా, వివాహంపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి.

విడాకులకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని అనేక నివేదికలు సూచిస్తున్నాయి.

జీవిత భాగస్వామిని గౌరవించడం లేదు.

వివాహం తర్వాత ఒకరితో జీవించడానికి, క్రమంగా వారిలో లోపాలు కనిపించవచ్చు, అవి అస్సలు నచ్చకపోవచ్చు. అయితే ఈ కారణంగా వాళ్ళను ఎప్పుడూ చిన్నచూపు చూడడం, గౌరవించకపోవడం సరికాదు. ఇలా తరచుగా జరిగితే వివాహాలు కొద్దిరోజులకే విడాకులకు దారితీస్తాయి.


ఇది కూడా చదవండి: వాషింగ్ మెషీన్లను వాడేటప్పుడు ఈ 6 టిప్స్‌ను పాటిస్తే.. కరెంటు బిల్లు సగానికి సగం తగ్గినట్టే..!

భాగస్వామిని అర్థం చేసుకోలేకపోవడం..

వైవాహిక జీవితంలో ఎదురయ్యే చాలా కష్టాలకు భార్యాభర్తలమధ్య సరైన అవగాహన లేకపోవడమే కారణం. ఇద్దరూ కలిసి ఉండాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ, అన్నింటికంటే నమ్మకం చాలా ముఖ్యం. అయితే భాగస్వామిని వేధింపులకు గురిచేయడం, గౌరవం లేకపోవడం వంటి పనులు కూడా విడాకుల వరకూ తెస్తాయి.

Updated Date - 2023-09-08T15:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising