ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Naseeruddin Shah : భార్యాభర్తలన్నాకా అర్థం చేసుకునే గుణం ఉండాలి.. లేకపోతే సంసారాలు తల్లకిందులే.. !!

ABN, First Publish Date - 2023-10-21T13:08:52+05:30

తన భర్తకు ఎన్నో వ్యవహారాలు ఉన్నాయని తెలిసినా నేటికీ తన దాంపత్య జీవితంలో సంతోషంగానే ఉంది

marriage

సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు దాటి రావాల్సి ఉంటుంది. అలా రాగలిగితేనే జీవితం బావుంటుంది. ఇక సామాన్యల జీవితాలకంటే సెలబ్రెటీలు జీవితాలు ఇందుకు ఏం భిన్నం కాదు. అందరి జీవితాల్లోనూ ఇదే తీరు నడుస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో సినీ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నసీరుద్దీన్ షా వ్యవహారం పై బాలీవుడ్ సీనియర్ నటి రత్నా పాఠక్ స్పందించిన తీరు మరో సంసారాన్ని మీడియాకు అప్పగించినట్టు అయింది. వివరాల్లోకి వెళితే..

చాలా కాలం క్రితం, అంటే 41 సంవత్సరాల క్రితం, రత్న పాఠక్ తన కుటుంబంపై తిరుగుబాటు చేసి విడాకులు తీసుకున్న ముస్లిం అబ్బాయి నసీరుద్దీన్ షాను వివాహం చేసుకుంది. తన భర్తకు ఎన్నో వ్యవహారాలు ఉన్నాయని తెలిసినా నేటికీ తన దాంపత్య జీవితంలో సంతోషంగానే ఉంది. అయితే రత్నా పాఠక్ చెప్పిన దాని వెనుక కారణం స్త్రీకి సహజంగా వచ్చిన సహనం మాత్రమే. వీరిద్దరి ప్రేమ గురించి మాట్లాడుకున్నారే కానీ ఎక్కడా కించపరిచే విధంగా ఏరోజూ లేరు.

ఒకరినొకరు తప్ప మరేమీ పట్టించుకోలేదు.

మని హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో సంభాషణలో రత్న పాఠక్ షా ఏం చెప్పిందంటే..

1975లో ఒక నాటకం రిహార్సల్ సమయంలో మేము ఒకరినొకరు కలుసుకున్నాం. ఇక్కడి నుంచే మా మధ్య ప్రేమ చిగురించడం మొదలైంది. ఆ సమయంలో నసీరుద్దీన్ షాకు వివాహం జరిగింది, అతనికి ఒక కుమార్తె ఉంది. అతని కుటుంబాన్ని చూసుకునే బాధ్యత కూడా ఉంది. మరోవైపు, నసీరుద్దీన్ షా డ్రగ్స్ బానిస అని నా కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ సమయంలోనే ఎవరినీ పట్టించుకోకుండా, ఒకరినొకరు ప్రశ్నించుకోకుండా ఇద్దరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. ఇదేపని చాలా ఏళ్ళు మేం కలిసి జీవించేలా చేసింది. మా మధ్య ఎలాంటి గిల్లికజ్జాలు రాకుండా చూసింది.

ఇది కూడా చదవండి: ఈ మొక్కగానీ ముట్టుకున్నారో అంతే.. ఇక తిన్నారంటే ప్రాణాలే పోతాయ్.. పొరపాటున కూడా అటుపోకండి.!


నసీరుద్దీన్ షా వ్యవహారంపై రత్న పాఠక్ ఇలా అన్నారు..

నా భర్త మీద వచ్చిన చాలా రూమర్స్ ని నేను తిప్పికొట్టాను. వాటిని కాదని మాది వేరే ప్రపంచంగా బ్రతుకుతూ వచ్చాం. స్త్రీ ఇలాంటి విషయాల్లో కాస్త పెద్ద మనసుతో ఆలోచించాలి. ప్రతి విషయానికి గందరగోళం పడకుండా శాంతంగా ఆలోచించగలిగితే సంసారం చక్కగా ఉంటుంది. మరీ ముఖ్యంగా భర్తను అర్థం చేసుకోవాలి. నిజానికి భార్యాభర్తలు ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉండాలి. అప్పుడే జీవితం బావుంటుంది. సంతోషంగా ఉంటుంది. ఇదే విషయాన్ని మా బంధం నిరూపించింది. అని సమాధానం చెప్పింది రత్నా పాఠక్.

Updated Date - 2023-10-21T13:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising