ఆరోగ్యం కోసం ‘అవిసె నూనె’
ABN, First Publish Date - 2023-12-05T04:27:49+05:30
ఈజిప్టు, చైనాల్లో పండించిన అత్యంత పురాతన ఫైబర్ క్రాప్స్‌లో ‘అవిసె’ ఒకటి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, పీచు ఎక్కువ.
కొలెస్టరాల్‌ను తగ్గించే, పోషకాలను అందించే నూనెను వంటకు ఉపయోగించాలి. ‘అవిసె నూనె’(ఫ్లాక్స్‌సీడ్ ఆయిల్) ఆ కోవకు చెందినదే! ఈ నూనె గురించిన మరిన్ని విశేషాలు...
ప్రత్యేకతలు: ఈజిప్టు, చైనాల్లో పండించిన అత్యంత పురాతన ఫైబర్ క్రాప్స్‌లో ‘అవిసె’ ఒకటి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, పీచు ఎక్కువ. కాబట్టే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను నివారించటంలో అవిసె నూనె సమర్థమైనదని పరిశోధనల్లో కూడా రుజువైంది. అయితే అవిసె గింజల పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి, పొడి చేసి లేదా నూనె రూపంలో తీసుకోవాలి.
ఆరోగ్యపరమైన లాభాలు: అవిసె నూనె వాడితే ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు.
కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది.
మెనోపాజ్ మహిళల్లో వేడి ఆవిర్లు తగుముఖం పడతాయి.
రేడియేషన్ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
వంటల్లో ఎలా వాడాలి?:
అవిసె నూనెను వేడి చేస్తే దాన్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి ఈ నూనెను వంట చివర్లో వాడాలి.
గ్రిల్, బేక్ చేసేటప్పుడు అవి పూర్తిగా ఉడికాక అవిసె నూనెను
పైపూతగా పూయాలి.
కూరగాయలు, పప్పుధాన్యాల వంటకాల్లో కూడా అవి పూర్తిగా ఉడికిన తర్వాతే ఈ నూనెను కలపాలి.
ప్రొటీన్ షేక్స్, వెజిటబుల్, ఫ్రూట్ జ్యూస్‌లకు అవిసె నూనె కలిపి తీసుకోవచ్చు.
కెచప్, సలాడ్స్‌లో కలుపుకుని తినొచ్చు.
సూప్స్, స్ట్యూలలో కలిపి తొనొచ్చు.
Updated Date - 2023-12-05T04:31:16+05:30 IST