ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: 7 నెలల బాబుకు అదే పనిగా దగ్గు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్తే.. ఎక్స్‌రే తీసి చూసిన డాక్టర్లకు షాక్.. ఊపిరితిత్తుల్లో..!

ABN, First Publish Date - 2023-10-10T12:49:15+05:30

ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని వైద్యులు చెబుతున్నారు.

persisted

వైద్య వృత్తిలో అరుదుగా జరిగే అద్భుతాలు, ఆశ్చర్యపరిచే విషయాలు కోకొల్లలు, రోగుల విషయంలో అయితే ఈ వింతలు విడ్డూరాలు పయపడే విధానం చాలా చిత్రంగా ఉంటుంది. దీనికి కొచ్చి లోని సంఘటనే ఉదాహరణ.. విషయంలోకి వెళ్ళాలంటే కాస్త ధైర్యం కావాల్సిందే. విషయం ఏంటంటే..

ఆగని దగ్గు, ఊపిరి ఆడకపోవడం, జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఏడు నెలల బాలుడి ఊపిరితిత్తుల నుంచి ఒకటిన్నర సెంటీమీటర్ల ఎల్‌ఈడీ బల్బు బయటకు వచ్చింది. కొట్టాయంకు చెందిన ఏడు నెలల పాపకు దగ్గు, ఊపిరి ఆడకపోవడం చాలా రోజులుగా ఉండడంతో కొట్టాయంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స అందించారు.

మందులు తీసుకున్న తర్వాత, ఇబ్బందులు తగ్గలేదు. ఊపిరితిత్తులలో విదేశీ వస్తువు ఉనికిని ఎక్స్-రే పరీక్షలో గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు కొచ్చి అమృత ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. బ్రోంకోస్కోపీ సమయంలో, కుడి ఊపిరితిత్తుల క్రింద ఇనుము లాంటి వస్తువు కనుగొనబడింది. రక్తం తదితరాలు కప్పి ఉండడంతో మొదట ఎల్‌ఈడీ బల్బు అని తేలకపోవడంతో దాన్ని బయటకు తీసి పరిశీలించగా ఊపిరితిత్తుల్లో ఎల్‌ఈడీ బల్బు ఇరుక్కుపోయిందని తేలింది.

ఇది కూడా చదవండి: ఇదన్నమాట అసలు సంగతి.. టిఫిన్‌లో ఓట్స్‌ను వాడమని డాక్టర్లు కూడా చెప్పడానికి కారణమేంటంటే..!


సుమారు ఒకటిన్నర సెంటీమీటర్ల పొడవున్న ఎర్రటి ఎల్ ఈడీ బల్బును బయటకు తీశారు. కొచ్చి అమృత హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ టింకు జోసెఫ్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ వైద్య ప్రక్రియను నిర్వహించింది.

ఎల్‌ఈడీ బల్బులు ఇప్పుడు మార్కెట్‌లో లభించే చాలా బొమ్మల్లో కనిపిస్తాయి. పిల్లలు వీటిని అజాగ్రత్తగా వాడడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డాక్టర్ వివరించారు. ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందని వైద్యులు చెబుతున్నారు. ఎల్‌ఈడీ బల్బు శ్వాసనాళంలో మరేదైనా చోటకు చేరితే కనుక శ్వాస తీసుకోవడంలో అవరోధం ఏర్పడి మరణించే అవకాశం కూడా ఉందని నిపుణులు వివరిస్తున్నారు. ఇలాంటి వస్తువులను పిల్లలకు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్దలు వాటితో ఆడే సమయంలో దగ్గరగా ఉండి గమనించాలని డాక్టర్ సూచనలు ఇచ్చారు.

Updated Date - 2023-10-10T12:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising